గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో కాక రేపుతున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. పీసీసీ రాజీనామా చేస్తానంటూ హడావిడి కూడా చేసి ఆ తరువాత వెనక్కి తగ్గారు. ఇక తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ముందు రోజు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ శాసన సభ పక్ష భేటిని బహిష్కరించారు. ఇక జగ్గారెడ్డి త్వరలోనే టీఆర్ఎస్లో చేరుతారన్న వార్తలు వినిపిస్తున్న తరుణంలోనే సీఎం కేసీఆర్ను ప్రశంసిస్తూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు మరొకసారి హాట్ టాఫిక్ గా మారాయి. అసెంబ్లీలో కేసీఆర్ చేసిన ఉద్యోగ ప్రకటనను స్వాగతిస్తున్నట్టు జగ్గారెడ్డి తెలిపారు.
Advertisement
Advertisement
రేపు సీఎంను కలిసేందుకు ఒక ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. నిరుద్యోగుల కోసం ముఖ్యమంత్రి మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకుగాను కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణలతో ఉద్యోగాల భర్తీ కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గత ఏడేళ్లుగా పోరాటాలు నిర్వహించాం. తెలంగాణలో ఈరోజు ఈ ఫలాలు వస్తున్నాయంటే అది సోనియా, రాహుల్ గాంధీల కృషే హౌసింగ్ డిపార్ట్మెంట్ ను పునఃప్రారంభించేందుకు నా వంతు కృషి చేస్తున్నాను. దీనికి సంబంధించి రేపు సీఎంను కలిసేందుకు అపాయింట్మెంట్ అడుగుతాను అని జగ్గారెడ్డి తెలిపారు.
Also Read : వామ్మో.. పంజాబ్లో లడ్డూలకు డిమాండ్ మాములు లేదుగా..!