Home » ఏపీ కేబినెట్ కీల‌క‌ నిర్ణ‌యం.. రాష్ట్రంలో రెండో భాష‌గా ఉర్దూ..!

ఏపీ కేబినెట్ కీల‌క‌ నిర్ణ‌యం.. రాష్ట్రంలో రెండో భాష‌గా ఉర్దూ..!

by Anji
Ad

బ‌డ్జెట్ స‌మావేశాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేబినెట్ ప‌లు కీల‌క చ‌ట్టాల స‌వ‌ర‌ణ‌ల‌కు ఆమోదం ప‌ల‌క‌డంతో పాటు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో రెండ‌వ భాష‌గా ఉర్దూను గుర్తిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణ‌యించింది. దీనిలో భాగంగా ఏపీ అధికార భాషా చ‌ట్టం 1966కు స‌వ‌ర‌ణ చేయాల‌ని తీర్మానించింది. అదేవిధంగా విదేశీ మ‌ద్యం నియంత్ర‌ణ చ‌ట్ట స‌వ‌ర‌ణ‌కు కూడా నిర్ణ‌యం తీసుకుంది. నిజాంప‌ట్నం, మ‌చిలీప‌ట్నం, ఉప్పాడ పిషింగ్ హార్బ‌ర్ల నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం ప‌లికింది.

Advertisement

బ‌డ్జెట్ స‌మావేశాల్లో భాగంగా సోమ‌వారం మ‌ధ్యాహ్నం జ‌రిగిన ఏపీ కేబినెట్ స‌మావేశంలో 35 కీల‌క అంశాల‌పై చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టే ప‌లు బిల్లుల‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. టీటీడీ ప్ర‌త్యేక ఆహ్వానితుల‌పై అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న బిల్లుల‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉద్యోగుల వ‌య‌స్సును 62 ఏళ్ల‌కు పెంచుతూ శాస‌న‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న బిల్లుకు ఆమోదం ల‌భించింది. ఉర్దూను సెకండ్ లాంగ్వేజ్ గా చ‌దువుకునేందుకు చ‌ట్ట స‌వ‌ర‌ణ‌కు కేబినెట్ నుంచి ఆమోదం ల‌భించింది.

Advertisement

తూనిక‌లు, కొల‌త‌ల‌శాఖ‌లో నిబంధ‌న‌లు అమ‌లు కోసం మెరుగైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నిర్ణ‌యించింది. నిజాంప‌ట్నం, మ‌చిలిప‌ట్నం, ఉప్పాడ పిషింగ్ హార్బ‌ర్ల నిర్మాణానికి ప‌రిపాల‌న‌ప‌ర‌మైన అనుమ‌తుల‌కు మంత్రి మండ‌లి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. రూ.1234 కోట్ల రూపాయిల‌తో మూడు పిషింగ్ హార్బ‌ర్ల నిర్మాణానికి ఆమోదం ల‌భించింది. బెంగుళూరు-క‌డ‌ప, విశాఖ‌ప‌ట్నం-క‌డ‌ప మ‌ధ్య వారానికి మూడు విమాన స‌ర్వీసులు న‌డ‌పేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నిర్ణ‌యించింది. స‌ర్వీసులు మొద‌లైన త‌రువాత ఏడాదికి రూ.15కోట్ల మేర‌కు మ‌ద్ద‌తును రాష్ట్ర ప్ర‌భుత్వం ఇవ్వ‌నున్న‌ది. అదేవిధంగా మ‌చిలీప‌ట్నం, భావ‌న‌పాడు, రామాయ‌ప‌ట్నం పోర్టుల నిర్మాణం కోసం రూ.8,741 రుణ స‌మీక‌ర‌ణ‌కు ఏపీ మారిటై బోర్డుకు హామీ ఇచ్చేందుకు ఏపీ మంత్రి వ‌ర్గం అంగీక‌రిస్తూ తీర్మాణం చేసింది.

Also Read :  స‌చిన్ రికార్డు బ్రేకు చేసి సెలక్ట‌ర్ల దృష్టిలో ప‌డ్డాడు.. త్వ‌ర‌లో టీమిండియాలో చోటు..!

Visitors Are Also Reading