రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని మోడీ ఫోన్లో మాట్లాడారు. దాదాపు 50 నిమిషాలు ఇద్దరి మధ్య సంభాషణ కొనసాగింది. ఉక్రెయిన్ నెలకొన్న పరిస్థితులపై వారు చర్చలు జరిపారు. ఉక్రెయిన్-రష్యా చర్చల పురోగతి గురించి ప్రధాని మోడీకి పుతిన్ వివరించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు, జెలెన్ స్కీతో నేరుగా చర్చలు జరపాలని మోడీ పుతిన్ను కోరారు. సుమీతో పాటు ఉక్రెయిన్లోని ఆయా ప్రాంతాల్లో కాల్పుల విరమణ ప్రకటించడం, మానవతా కారిడార్ల ఏర్పాటు పై రష్యాను అభినందించారు.
Advertisement
Advertisement
ముఖ్యంగా సుమీ నుంచి భారతీయు తరలింపు అవసరాన్ని ప్రధాని నొక్కి చెప్పారు. ఈ విషయంపై తమవంతు సహకారం అందిస్తామని పుతిన్, ప్రధాని మోడీకి హామీ ఇచ్చారు. మరొక వైపు ఐరోపాలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్ర మైన జపోరిషియా నూక్లియర్ ప్లాంట్ను రష్యా సేనలు ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసినదే. ప్రస్తుతం అక్కడ మొబైల్, ఇంటర్నెట్ సేవలను రష్యా బలగాలు నిలిపివేశాయి. ప్లాంట్ నుంచి ఎటువంటి సమాచారం బయటకు రావొద్దనే ఉద్దేశంతోనే ఈ సేవలను నిలిపివేసి ఉంటారని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఓ ప్రకటలో వెల్లడించింది.
ఉక్రెయిన్ భీకర దాడులకు మరొకమారు విరామం ఇచ్చింది. రష్యా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయెల్ మెక్రాన్ వినతి మేరకు మానవతా కారిడార్ ఏర్పాటు కోసం తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించినట్టు స్పుత్నిక్ మీడియా వెల్లడించింది.
Also Read : ఉక్రెయిన్ అధ్యక్షునికి ప్రధాని మోడీ ఫోన్.. అక్కడి పరిస్థితులపై ఆరా..!