ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు కేంద్రం రూ.55వేల కోట్లు నిధులు ఇచ్చిందని గుర్తుచేసారు. డబ్బులు డ్రా చేయాలని అపన తప్ప ప్రాజెక్టుల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయడం లేదని ఆయన విమర్శించారు. రాయలసీమ ఉండే నీటి సమస్య పై ఈ నెల 19న రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కడప బీజేపీ భారీ ఎత్తున ధర్నాకు సోము వీర్రాజు పిలుపునిచ్చారు.
Advertisement
Advertisement
రాయలసీమను రత్నాల సీమగా చూడాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో గతంలో చంద్రన్న బాట, ప్రస్తుతం రైతు భరోసా కేంద్రాలు, జగనన్న ఆరోగ్య కేంద్రాలు, సచివాలయాలు కట్టారని అన్నారు. ప్రధాని అవాస్ యోజన పథకం కింద నగరంలో 16లక్షలు ఇల్లు, పంచాయతీల్లో 5 లక్షల ఇల్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 40 వేల కోట్లు జగనన్న కాలనీలకు ఉపయోగించారు. అవన్నీ జగనన్న కాలనీలు కాదు.. మోడీ కాలనీలు అని పేర్కొన్నారు.
Also Read : Revanth Reddy : కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ ఇదే..!