బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగాల్లో మరొక ముందడుగు పడింది. బ్రహ్మోస్ ఆధునిక శ్రేణి క్షిపణి ప్రయోగాన్ని నౌకాదళం విజయవంతంగా ప్రయోగించింది. దీర్ఘశ్రేణిలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి పూర్తి కచ్చితత్వంతో ఛేదించినట్టు నౌకాదళం ప్రకటించింది. త్రివిధ దళాల్లోని వివిధ మాధ్యమాల యుద్ధ సన్నద్ధతను ఈ ప్రయోగం చాటి చెప్పిందని వెల్లడించింది.
Advertisement
Advertisement
బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిస్సైల్ ఇప్పటికే త్రివిధ దళాల్లో చేరినా దీనికి సంబంధించిన మరింత ఆధునిక శ్రేణి క్షిపణి ప్రయోగాలను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) నిర్వహిస్తోంది. రష్యాతో కలిసి భారత్ ఈ క్షిపణులను రూపొందిస్తోంది. మరొక వైపు రష్యా- ఉక్రెయిన్ మధ్య గత పది రోజుల నుంచి వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Also Read : జడ్డూ డబుల్ సెంచరీ మిస్.. ద్రవిడ్‌పై ఫైర్ అవుతోన్న ఫ్యాన్స్..!