Home » పోలీసుల‌పై విరుచుకుప‌డ్డ ఏపీ మంత్రి పేర్నినాని.. ఎందుకో తెలుసా..?

పోలీసుల‌పై విరుచుకుప‌డ్డ ఏపీ మంత్రి పేర్నినాని.. ఎందుకో తెలుసా..?

by Anji
Ad

ఎప్పుడు సౌమ్యంగా ఉండే ఏపీ మంత్రి పేర్నినానికి ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా కోపం వ‌చ్చింది. తీవ్ర ఆగ్ర‌హంతో ఊగిపోయారు. పోల‌వ‌రం ప్రాజెక్ట్ వ‌ద్ద పోలీసులు ఆయ‌న కారును ప‌క్క‌కు తీయాల‌ని చెప్ప‌డంతో అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. రోడ్డు ప‌క్క‌న పార్కింగ్ చేసి ఉన్న నాని కారును అక్క‌డ నుంచి తీయాల‌ని పోలీసులు సూచించారు. అప్పుడు ఆ మంత్రికి కోపం వ‌చ్చింది.

Advertisement

నా కారు తీయ‌మ‌న్న‌ది ఎవ‌రంటూ ఓ రేంజ్‌లో క్లాస్ పీకారు. అక్క‌డే మ‌రికొన్ని కార్లు పార్క్ చేసి ఉండ‌డంతో అవ‌న్ని ఎవ‌రి కార్లంటూ ఓ రేంజ్‌లో నిల‌దీశారు. ఎస్పీ, డీఐజీ కార్లు అని పోలీసులు బ‌దులు ఇవ్వ‌డంతో మ‌రింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మాషాలు చేస్తున్నారా..? న‌ఏను ఇన్‌చార్జీ మంత్రిని అంటూ చెడా మ‌డా తిట్టేశారు.

Advertisement

ఇక్క‌డితే పండుగ అయిపోలేదంటూ విరుచుకు ప‌డ్డారు. డిసిగ్నేష‌న్లు త‌క్కువ అయిన వారి వాహ‌నాలు అక్క‌డే ఉచి నా కారు తీయ‌మంటావా అంటూ పోలీసుల‌పై ఫైర్ అయ్యారు. ఎదురుగా ఉన్న పోలీస్ అధికారి వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నా.. మంత్రి అత‌ని మాట‌లు ప‌ట్టించుకోకుండా మాట‌ల‌తో విరుచుకుప‌డ్డారు. కేంద్ర మంత్రి గ‌జేంద్ర షెకావ‌త్, సీఎం పోల‌వ‌రం ప‌ర్య‌ట‌న‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Also Read :  ‘సొంత వారు అల్లం.. బ‌య‌టి వారు బెల్ల‌మా’ అంటున్న ష‌ర్మిల

Visitors Are Also Reading