Home » ఆస్ట్రేలియా దిగ్గ‌జ క్రికెట‌ర్ మృతి

ఆస్ట్రేలియా దిగ్గ‌జ క్రికెట‌ర్ మృతి

by Anji
Ad

ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెట‌ర్‌, మాజీ వికెట్ కీప‌ర్ రాడ్ మార్ష్ (74) క‌న్నుమూశారు.గుండెపోటు వ‌చ్చిన వారం రోజుల త‌రువాత ఆడిలైడ్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస‌ను విడిచారు. ముఖ్యంగా బౌల‌ర్ డెన్నిస్ లిల్లీతో క‌లిసి ఎన్నో అద్వితీయ వికెట్ల భాగ‌స్వామ్యం నెల‌కొల్పాడు.

Advertisement

Advertisement

మార్ష్ 1970 నుంచి 1984 వ‌ర‌కు 96 టెస్ట్‌లు, 92 వ‌న్డేలు ఆడాడు. కీప‌ర్‌గా టెస్ట్‌ల్లో 355 మందిని ఔట్ చేశాడు. అత‌ని రిటైర్‌మెంట్ వ‌ర‌కు ఇదే ప్ర‌పంచ రికార్డు. ముఖ్యంగా ఆస్ట్రేలియా జ‌ట్టు త‌రుపున టెస్టుల్లో తొలి సెంచ‌రీ చేసిన వికెట్ కీప‌ర్‌గా కూడా రికార్డు సాధించాడు. 1985లో స్పోర్ట్స్ ఆస్ట్రేలియా ఆప్ ఫేమ్‌లో చోటు ద‌క్కించుకున్నాడు. మ‌రొక వైపు కోచ్‌గా, కామెంటెట‌ర్‌గా, 2014 నుంచి 2016 వ‌ర‌కు ఆస్ల్రేలియా సెల‌క్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్‌గా ప‌ని చేశారు. రాడ్ మార్ష్‌.

Also Read :  మ‌హిళ‌ల ప్ర‌పంచ క‌ప్‌లో అన్ని మ్యాచ్‌ల‌కు డీఆర్ఎస్ విధానం

Visitors Are Also Reading