రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్దం జరుగుతున్న సంగతి తెలిసిందే. రష్యా ఉక్రెయిన్ పై మెరుపు దాడులు చేయడంతో అక్కడ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా విదేశీయులు బయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే భారతీయ విద్యార్థులను అక్కడ నుండి స్వదేశానికి చేరుస్తుండగా తాజాగా అక్కడ రష్యా చేసిన దాడిలో భారతీయ విద్యార్థి నవీన్ కన్నుమూశాడు. నవీన్ కర్నాటక రాష్ట్రానికి చెందినవాడు. అయితే యుద్దం జరుగుతున్న సమయంలో నవీన్ బంకర్ లో విద్యార్థులతో కలిసి తల దాచుకున్నాడు.
Advertisement
Advertisement
కానీ అకస్మాత్తుగా నవీన్ బయటకు రాగా రష్యా దాడిలో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ దృవీకరించింది. ఇదిలా ఉంటే తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ నవీన్ కుటుంబానికి ఫోన్ చేసి పరామర్శించాడు. నవీన్ మృతి పట్ల మోడీ సంతాపం ప్రకటించారు. కర్నాటక ముఖ్యమంత్రి బొమ్మై కూడా నవీన్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. నవీన్ మృతదేహాన్ని తరలించడానికి సీఎం విదేశాంగశాఖతో మాట్లాడారు.