టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానాలు నటించిన మల్టీస్టార్ మూవీ సాగర్ కే దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భీమ్లానాయక్. ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల తుఫాన్ సృష్టిస్తూ.. సక్సెస్ పుల్ గా దూసుకుపోతుంది. అయితే తాజాగా భీమ్లానాయక్ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంలో తమ మనోభావాలు దెబ్బతినే విధంగా సన్నివేశాలను చిత్రీకరించారు అని ఆంధ్రప్రదేశ్లోని కుమ్మరి, శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ ఎం.పురుషోత్తం తెలిపారు.
Advertisement
Advertisement
తమ మనోభావాలను కించ పరిచేవిధంగా చిత్రీకరించిన ఓ సన్నివేశం ఈ చిత్రం నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్‌కు పురుషోత్తం ఫిర్యాదు చేశారు. పవన్ కల్యాణ్, రానా మధ్య ఓ ఫైటింగ్ సన్నివేశంలో రానా కుమ్మరి చక్రాన్ని కాలితో తన్ని దానిని తీసుకుని పవన్‌పై దాడి చేసినట్టు చూపించారు. అయితే తాము కుమ్మరి చక్రాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తాం అని, దానిని కాలితో తన్నినట్టు చూపించడం తమను కించపరచడమే కాదు.. కుమ్మరుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ సన్నివేశం సినిమా నుంచి తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.
Also Read : మాజీ ప్రియురాళ్ల నెంబర్లతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్.. పేరు ఏమిటంటే..?