Home » గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూషణ్‌తో సీఎం వైఎస్ జ‌గ‌న్ భేటీ..ఎందుకంటే..?

గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూషణ్‌తో సీఎం వైఎస్ జ‌గ‌న్ భేటీ..ఎందుకంటే..?

by Anji
Ad

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ గ‌వ‌ర్న‌ర్‌తో భేటీ అయ్యారు. అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో వీరి భేటీకి ప్రాధాన్య‌త సంతరించుకుంది. గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ దంప‌తుల‌ను సీఎం జగ‌న్‌, ఆయ‌న స‌తీమ‌ణి భార‌తి రాజ్ భ‌వ‌న్‌లో క‌లిసారు. దాదాపు అర‌గంట‌కు పైగా స‌మ‌కాలిన రాజ‌కీయ అంశాల‌పై గ‌వ‌ర్న‌ర్, సీఎం చ‌ర్చించారు. త్వ‌ర‌లో అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు జరుగ‌నున్న విష‌యాన్ని గ‌వ‌ర్న‌ర్ దృష్టికి తీసుకొచ్చి అనుమ‌తి తీసుకున్నారు జ‌గ‌న్‌. జిల్లాల పున‌ర్ విభ‌జ‌న అంశాన్ని సీఎం గ‌వ‌ర్న‌ర్‌కు వివ‌రించారు.

Advertisement

Advertisement

పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల వారిగా జిల్లాల పున‌ర్ విభ‌జ‌న జ‌రుగుతుంద‌ని, ప్ర‌జ‌ల ఉంచి విన‌తుల‌ను స్వీక‌రించి ఆమోద యోగ్య‌మైన రీతిలో నూత‌న జిల్లాల‌ను ఏర్పాటు చేస్తామ‌ని వివ‌రించారు. సీఎంజ‌గ‌న్ ఏపీలో ఈనెల నుంచి అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగ‌నున్నాయి. 7న ఉభ‌య స‌భ‌ల‌నుద్దేశించి ప్ర‌సంగించనున్నారు. 8న గౌత‌మ్ రెడ్డి మృతిపై స‌భ సంతాపం తెల‌ప‌నుంది. 11న బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశ‌ముంది. బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న‌పై ఆర్థిక శాఖ ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు ఆరంభించింది. ప్ర‌స్తుత బ‌డ్జెట్ లో విద్య‌, వైద్య రంగాల‌కు అధిక ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండ‌గా.. 2019తో పోల్చుకుంటే రాబ‌డులు భారీగా పెరిగాయి. గ‌త బ‌డ్జెట్‌తో వివిధ రంగాల‌కు చేసిన కేటాయింపులు ప్ర‌స్తుతం బ‌డ్జెట్‌లో చేసే కేటాయింపుల‌పై ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి సారించింది. ఈ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు రెండు వారాల‌కు పైగా నిర్వ‌హించాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్ యోచిస్తోంది.

Also Read :  అణ్వ‌స్త్రాల‌ను ర‌ష్యా మోహ‌రించిందా..? పుతిన్ ప్ర‌క‌ట‌న ఆ దేశాల‌కోస‌మేనా..?

Visitors Are Also Reading