పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోడీ పై ఎప్పుడు విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. ఎన్నికల సమయంలో అయితే మాటలతో కత్తులు దూస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా అప్పట్లో మోడీ పశ్చిమ బెంగాల్ పర్యటన కు రాగా దిది ఆ కార్యక్రామనికి కూడా హాజరు కాలేదు. గత ఎన్నికల్లో సింగిల్ గా బిజెపిని ఢీ కొట్టి సీఎం ఖుర్చి పై కూర్చున్నారు. అయితే తాజాగా మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Advertisement
Advertisement
ఉక్రెయిన్ సంక్షోభ నేపథ్యంలో ప్రధాని మోడీ కి పూర్తి మద్దతు తెలుపుతున్నామని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ అంశంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని లేఖ ద్వారా ప్రధానికి వివరించారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్రమైన సంక్షోభం ఏర్పడిందని దాని నుండి బయట పడటం ఎంతైనా అవసరం ఉందని పేర్కొన్నారు. కాబట్టి అఖిలపక్షం ఏర్పాటు చేయడాన్ని ప్రధాని మోడీ పరిశీలించాలని కోరారు. అయితే మమత బెనర్జీ విన్నపాన్ని మోడీ పట్టించుకుంటారా లేదా అన్నది చూడాలి.