రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ కొనసాగుతూనే ఉన్నది. ఉక్రెయిన్ను పూర్తిస్థాయిలో ఆధీనంలోకి తీసుకోవాలి రష్యా భావిస్తుండగా.. ఉక్రెయిన్ సైన్యం ప్రజల నుంచి కూడా తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది. మరొకవైపు ఇప్పటికే తాము ఉక్రెయిన్ తో చర్చలకు సిద్ధం అని ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. తాజాగా రష్యాతో చర్చలకు అంగీకారం తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కాగా.. బెలారస్ లో రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు జరుగనున్నాయని రష్యన్ మీడియా మాస్కోలో ప్రకటించినది.
Advertisement
Advertisement
చర్చల కోసం బెలారస్ కు ఉక్రెయిన్ బృందం బయలు దేరింది. బెలారస్లోని గోమెల్లో రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు జరుగనున్నాయి. యుద్ధం ప్రారంభమైన చర్చలకు వెళ్లడంతో ఇప్పటికే భారీగా నష్టం జరిగినది. ప్రాణనష్టం, ఆస్తి నష్టం ప్రాణభయంతో కొంత మంది దేశాన్ని వీడడం.. ఇలా ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి.