పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన ఆస్ట్రేలియయా క్రికెట్ జట్టు ఆటగాడి భార్యకు బెదిరింపులు వచ్చాయి. సోషల్ మీడియాలో బెదిరింపులు రావడంతో క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ చేపట్టింది. పాకిస్తాన్‌ను సందర్శించకూడదు అని అందులో పేర్కొంటూ.. లేదంటే హత్య చేస్తామంటూ అందులో పేర్కొన్నారు. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంయుక్తంగా విచారణ జరుపుతున్నాయి.
Advertisement
ఆస్ట్రేలియన్ మీడియా ఈ కథనాన్ని ప్రచురించింది. ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టు 24 ఏళ్ల తరువాత పాకిస్తాన్ పర్యటనలకు వెళ్లింది. ఆస్ట్రేలియా చివరిసారిగా 1998లో పాకిస్తాన్‌లో పర్యటించింది. ప్రస్తుత పర్యటన మార్చి 04 రావల్పిండిలో తొలి టెస్ట్ మ్యాచ్‌తో ప్రారంభం అవుతుంది. ది సిడ్ని మార్నింగ్ హెరాల్డ్ ప్రకారం.. ఆస్ట్రేలియన్ స్పిన్నర్ అష్టన్ అగర్ భార్య మాడెలైన్‌కు బెదిరింపు సందేశం పంపారు. ఈ విషయంపై వెంటనే క్రికెట్ ఆస్ట్రేలియా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డులకు సమాచారం అందించారు.
Advertisement
ఆస్ట్రేలియన్ జట్టు ప్రతినిధి ఎగ్గర్ కూడా ఈ వార్తలను ధృవీకరించారు. పాకిస్తాన్ పర్యటనకు వస్తే మీ భర్త అష్టన్ చంపేస్తామని అతను ప్రాణాలతో తిరిగిరాడని ఆ మెసేజ్‌లో రాసి ఉంది. టీమ్ తో పాటు భద్రతా సిబ్బంది ఈ విషయాన్ని విచారించగా.. అది అంత సీరియస్‌గా లేదని భావిస్తున్నారు. ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ బెదిరింపు వచ్చినట్టు కూడా చెబుతున్నారు. ఈ ఇన్ స్ట్రాగ్రామ్ ఖాతా భారత్‌తో ముడిపడి ఉందని చెబుతున్నారు. మరొక భద్రతా కారణాల దృష్ట్యా ఏ ప్రధాన ఆటగాడు తన పేరును ఉపసంహరించుకోలేదు. టెస్ట్ సిరీస్ తరువాత వన్డేలు, టీ20లు మ్యాచ్‌లు కూడా ఆడనున్నాయి. సిరీస్ లోని అన్ని మ్యాచ్‌లు రావల్పిండి, లాహోర్, కరాచీలలో మాత్రమే జరుగుతాయి.
Also Read : వావ్.. ఆ క్యాచ్ అద్భుతం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు