క్రైస్ట్ చర్చ్ టెస్ట్ లో న్యూజిలాండ్ పరిస్థితి దారుణగా తయారైంది. దక్షిణాఫ్రికా జట్టు మ్యాచ్ పై గట్టి పట్టు సాధిస్తోంది. నాలుగో రోజు ఆటల కివీ జట్టు ఆటగాడు విల్ యంగ్ తన అత్తుత్తమ ఫీల్డింగ్‌తో నెట్టింట్లో వైరల్‌గా మారాడు. దక్షిణాఫ్రికా రెండవ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ ఓ ఆశ్చర్యకరమైన క్యాచ్ పట్టాడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మ్యాచ్‌లో కామెంట్రీ చేస్తున్న మాజీ క్రికెటర్లు కూడా ఇలాంటి క్యాచ్ పట్టుకున్నాడో నమ్మలేకపోయారు. విల్ యంగ్ దక్షిణాఫ్రికా ఆటగాడు మార్కో యాన్సస్ అందించిన అద్భుత క్యాచ్‌ను పట్టాడు. డీన్ గ్రాండ్ హోమ్ ను యాన్సన్ ఓ భారీ షాట్ కొట్టాడు. అయితే విల్ యంగ్ బౌండరీ లైన్లో అద్భుతమైన క్యాచ్ పట్టుకోవడంతో సౌత్ ఆఫ్రికా ఆటగాడి ఇన్నింగ్స్ ముగిసింది.
Also Read : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈసారి బడ్జెట్ ఏవిధంగా అంటే..?
Advertisement
మార్కో యాన్సన్ లాంగ్ ఆన్ మిడ్ వికెట్ మధ్య అద్భుతమైన షాట్ ఆడాడు. అయితే విల్ యంగ్ తన ఎడమ వైపున ఉన్న బంతికి దగ్గరగా పరుగెత్తాడు. ఆపై ఒక్క ఉదుటున దూకి బంతిని ఒక చేత్తో పట్టుకున్నాడు. విల్ యంగ్ క్యాచ్ పట్టిన వీడియో నిజంగా షాకింగ్ గా ఉంది. యంగ్ ఇలాంటి క్యాచ్ పట్టాడంటే న్యూజిలాండ్ ఆటగాళ్లు కూడా నమ్మలేకపోతున్నారు.
క్వింటన్ కాక్ ఆకస్మక రిటైర్మెంట్ తరువాత వికెట్ కీపర్ గా బాధ్యతలు స్వీకరించిన కైల్ వెర్న్ తొలి సెంచరీతో న్యూజిలాండ్ తో సోమవారం జరిగిన రెండవ క్రికెట్ టెస్క నాలుగో రోజు దక్షిణాఫ్రికా తమపై చేయి సాధించింది. వెర్న్ అజెయంగా 136 పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా టీకి ముందు 9 వికెట్లు నష్టానికి 354 పరుగుల వద్ద తమ రెండవ ఇన్నింగ్స్‌ను డిక్లెర్ చేసి న్యూజిలాండ్ ముందు 425 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ తరువాత ఆతిథ్య జట్టు 94 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.