భారత జట్టు టీ 20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లతో ఓటమి తరువాత వరుసగా 12 విజయాలను సాధించింది. ఈ ఫార్మాట్‌లో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన అప్గానిస్తాన్, రొమెనియా జట్ల సరసన నిలిచింది. 12 మ్యాచ్‌లలో ఆడిన ఒకే ఒక్క ఆటగాడు కెప్టెన్ రోహిత్ శర్మ. అయితే.. ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్నా.. అతనికి కచ్చితంగా ఓపెనింగ్ జోడీ లేకపోవడం ఇప్పుడు కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. కే.ఎల్. రాహుల్ లేదా ఇషాన్ కిషన్ ఎవరూ అందుబాటులో ఉంటే వారితో హిట్ మ్యాన్ బరిలోకి దిగుతున్నాడు. ఆటగాళ్ల గాయం కారణంగా రోహిత్‌కు కచ్చితమైన ఓపెనింగ్ ప్లేయర్ ఒకరుంటే కాస్త స్థిరత్వం ఉంటుంది.
Advertisement
ఇంతకు ముందు టీమిండియాలో నెంబర్ 03వ ఆటగాడు అంటే విరాట్ కోహ్లీనే.. అయితే తాజాగా సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్ ఆ స్థానాన్ని కైవసం చేసుకునే విధంగా కనిపిస్తున్నారు. అవకాశం లభించినప్పుడల్లా బ్యాట్‌తో రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా కోహ్లీ కంటే దూకుడైన ఆటతో అదరగొడుతున్నారు. గత ఏడాది శ్రేయాస్ గాయపడడంతో అవకాశం దక్కించుకున్న సూర్యకుమార్ యాదవ్ అవకాశాన్ని అందిపుచ్చుకుని తనదైన శైలిలో మెరుపులు మెరిపిస్తున్నారు. తాజాగా శ్రీలంక సిరీస్‌లో శ్రేయాస్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీలక పాత్ర పోషించాడు. కోహ్లీ తిరిగి జట్టులోకి వస్తే.. సూర్యకుమార్, శ్రేయస్ ఏయే స్థానాల్లో ఆడతారో చూడాలి.
Advertisement
ప్రస్తుతం టీమిండియా ఇప్పట్లో టీ-20 మ్యాచ్‌లు ఆడకపోయినా.. ఐపీఎల్ తరువాత దక్షిణాఫ్రికాతో 5 టీ-20లు, ఇంగ్లాండ్ పర్యటనలో 3 టీ-20లు ఆడనున్నది. నేరుగా ప్రపంచ కప్‌లోనే అడుగుపెట్టనున్నది. ఒక నిర్దిష్టమైన జట్టును ఎంపిక చేసే తరుణంలో అటు కెప్టెన్ రోహిత్‌కు.. ఇటు జట్టు యజమాన్యానికి ఇలాంటి సవాళ్లు ఎదురుకానున్నాయి.
Also Read : BIGG BOSS OTT : ముమైత్ ఖాన్ నా చెయ్యి విరగొట్టింది..శ్రీరాపాక సెన్సేషనల్ కామెంట్స్…!