టాలీవుడ్ లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటులలో మురళీమోహన్ కూడా ఒకరు. ఆయన 1970లలో తన సినీప్రస్థానాన్ని మొదలు పెట్టారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జగమేమాయ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మురళీ మోహన్ తిరుపతి సినిమాతో హిట్ అందుకున్నారు. ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించగా ఈ చిత్రం తరవాత మురళీ మోహన్ ఇండస్ట్రీలో ఫుల్ బిజీ అయ్యారు.
ALSO READ : బ్రదర్ అనిల్ రాజకీయాల్లోకి వస్తున్నారా..? ఆ వ్యాఖ్యల వెనక అసలు అర్థం ఏంటి..!
Advertisement
మురళీ మోహన్ కేవలం నటుడిగా కాకుండా వ్యాపార వేత్తగా…. నిర్మాతగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మురళీ మోహన్ పాపులర్ అయ్యారు. సినిమాలలో సంపాందిచిన డబ్బును రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టి ఎంతో సక్సెస్ అయ్యారు. అయితే అతడు సినిమా తరవాత మాత్రం మురళీ మోహన్ మళ్లీ సినిమాలు నిర్మించలేదు.
Advertisement
దానికి గల కారణాలను ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. జయభేరీ అనే బ్యానర్ లో మురళీ మోహన్ సినిమాలను తెరకెక్కించారు. అయితే ఇదే బ్యానర్ పై మురళీ మోహన్ అతడు సినిమాకు కూడా తెరకెక్కించారు. కాగా అతడు సినిమా సమయంలో తాను రాజకీయంగా బిజీగా మారానని మురళీ మోహన్ వెల్లడించారు. సినిమాను నిర్మించేటప్పుడు మేనేజర్ లను నమ్ముకోకుండా అన్నీ దగ్గరుండి చూసుకోవాలని అన్నారు.
అప్పుడే సినిమాల్లో సక్సెస్ కాగలము అని చెప్పారు. మళ్లీ తన బ్యానర్ జయభేరి పై సినిమాలు తీసే ఆలోచనలో ఉన్నట్టు మురళీ మోహన్ స్పష్టం చేశారు. రాజకీయాలకు తను పూర్తిగా గుడ్ బై చెప్పానని అన్నారు. ఎలాంటి పదవులు వచ్చినా తనకు వద్దని…టీటీడీ చైర్మెన్ గా తనకు విధులు నిర్వహించాలని ఉండేదని చెప్పారు. కానీ దానికోసం వెళితే ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఇవ్వకూడదని పాలసీ పెట్టుకున్నామని అన్నారని చెప్పారు.