Home » శ్రీ‌లంక‌పై భార‌త్ విజ‌యం.. రోహిత్ స‌రికొత్త రికార్డు..!

శ్రీ‌లంక‌పై భార‌త్ విజ‌యం.. రోహిత్ స‌రికొత్త రికార్డు..!

by Anji
Published: Last Updated on
Ad

శ్రీ‌లంక‌తో టీ 20 సిరీస్‌లో భార‌త్ బోణీ కొట్టింది. ల‌క్నో వేదిక‌గా గురువారం జ‌రిగిన మ్యాచ్‌లో 62 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఇషాన్ కిష‌న్ అద్భుత‌మైన ఇన్నింగ్స్‌కు తోడు శ్రేయ‌స్ అయ్య‌ర్ హాప్ సెంచ‌రీతో ఆక‌ట్టుకునే ప్ర‌ద‌ర్శ‌న చేసారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు అదిరిపోయే ఆరంభం ద‌క్కింది. తొలి వికెట్‌కు రోహిత్ శ‌ర్మ, ఇషాన్ కిష‌న్ 111 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. ఈ త‌రుణంలోనే 44 ప‌రుగులు చేసిన  ల‌హిరు కుమార బౌలింగ్‌ లో రోహిత్ ఔట‌య్యాడు.

Also Read :  ఆ ఎమ్మెల్యేకు ప్ర‌జ‌లు ఝ‌ల‌క్‌..ఎందుకంటే..?

Advertisement

ఈ త‌రుణంలోనే రోహిత్ టీ-20ల్లో స‌రికొత్త రికార్డు సృష్టించాడు. పొట్టి ఫార్మాట్ల‌లో ఎక్కువ ప‌రుగులు చేసిన బ్యాట‌ర్‌గా నిలిచాడు. ప్ర‌స్తుతం 3307 ప‌రుగుల‌తో ఉన్నాడు. ఆ త‌రువాత స్థానాల్లో గ‌ప్టిల్ 3299 కోహ్లీ 3296 కొన‌సాగుతున్నారు. రోహిత్ ఔట్ అయిన త‌రువాత శ్రేయాస్‌తో క‌లిసి ఇషాన్‌స్కోరు బోర్డును ప‌రుగులు పెట్టించాడు. ఇషాన్ సెంచ‌రీ చేస్తాడ‌ని అంద‌రూ భావించారు. కానీ 89 ప‌రుగుల వ‌ద్ద ఔట్ అయ్యాడు. అనంత‌రం శ్రేయ‌స్ దంచికొట్టారు. 57 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు.

Advertisement


జ‌డేజా 3 ప‌రుగులు చేశాడు. దీంతో నిర్ణిత ఓవ‌ర్ల‌లో 199 ప‌రుగులు సాధించింది భార‌త్. అనంత‌రం 200 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో శ్రీ‌లంక బ‌రిలోకి దిగి త‌డ‌బ‌డింది. తొలి బంతికే నిషాంక వికెట్ కోల్పోయింది. ఆ త‌రువాత వ‌రుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. దీంతో ఓవ‌ర్ల‌న్నీ ఆడి ప‌రుగులు చేసింది జ‌ట్టు శ్రీ‌లంక బ్యాట‌ర్ల‌లో అస‌లంక అత్య‌ధికంగా 53 ప‌రుగులు చేశాడు. భార‌త బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, వెంటేష్ అయ్య‌ర్ త‌లో రెండు వికెట్లు తీయ‌గా.. జ‌డేజా, చాహ‌ల్ ఒక్కొక్క వికెట్ తీసారు. ఈ మ్యాచ్‌లో చండిల్ వికెట్ తీసిన త‌రువాత పుష్ప మేన‌రిజంతో జ‌డేజా అంద‌రినీ మెప్పించాడు.

Also Read :  ఆ ఎమ్మెల్యేకు ప్ర‌జ‌లు ఝ‌ల‌క్‌..ఎందుకంటే..?

Visitors Are Also Reading