న్యూజిలాండ్ వేదికగా మరొక పది రోజుల్లో ప్రారంభమయ్యే మహిళల ప్రపంచకప్ పోటీల సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి కీలక నిర్ణయం తీసుకున్నది. జట్టు సభ్యుల్లో కరోనా కేసులు తలెత్తితే తొమ్మిది మంది ప్లేయర్స్‌తోనైనా మ్యాచ్‌లను నిర్వహించనున్నట్టు వెల్లడించించి ఐసీసీ. ఇప్పటికే ఇలాంటి విధానంతో అండర్ -19 వరల్డ్ కప్‌లో కొన్ని మ్యాచ్‌లు జరిగాయి. యువ భారత్ ఐదవ సారి అండర్ 19 ప్రపంచకప్‌ను గెలుచుకున్న విషయం తెలిసినదే.
Also Read : IPL 2022 : పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్‌గా మయాంక్ పేరు ఖరారు..!
Advertisement
Advertisement
ఏదైనా జట్టులోని ఆటగాళ్లకు కరోనా వ్యాప్తి చెందితే మేనేజ్‌మెంట్ కోచింగ్ సిబ్బందిలోని వారిని ఫీల్డింగ్ చేయడానికి అనుమతించేవారమని ఐసీసీ ఈవెంట్స్ హెడ్ క్రిస్ టెట్లీ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం అయితే తొమ్మది మంది ప్లేయర్లతో మైదానంలోకి దిగేందుకు జట్లకు అనుమతిస్తాం. అలాగే సబ్ స్టిట్యూట్లలో నాన్ బ్యాటింగ్ నాన్ బౌలర్ గా ఇద్దరినీ ఆడించుకోవచ్చు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రతీ టీమ్ అదనంగా ఆటగాళ్లను రిజర్వ్ లో ఉంచుకోవాలని సూచించాం. అలాగే 15 మంది సభ్యులు కచ్చితంగా కరోనా నియమాలకు లోబడి ఉండాలని క్రిస్ టెట్లీ వివరించారు.
ముఖ్యంగా మ్యాచ్‌లను రీ షెడ్యూల్ చేయవచ్చనే వార్తలను ఐసీసీ కొట్టిపడేయలేదు. మార్చి 04 నుంచి ఆతిథ్య దేశం న్యూజిలాండ్, వెస్టిండిస్ జట్ల మధ్య మౌంట్ మౌగనుమ్ వేదికగా తొలి మ్యాచ్‌లో టోర్నమెంట్ ప్రారంభం కానుంది. మహిళల టీమిండియా జట్టు మొదటి మ్యాచ్‌లో మార్చి 06న పాకిస్తాన్‌తో తలపడనున్నది.
Also Read : Viral Video : ప్రపంచం చూపు మొత్తం చూపు ఆ జర్నలిస్ట్ వైపే..!