ఉక్రెయిన్ – రష్యా మధ్య భీకర యుద్దం కొనసాగుతోంది. రెండు దేశాలకు చెందిన సైనిక దళాలు బాంబులు, మిస్సైల్స్‌తో దాడి చేసుకుంటున్నారు. ఇప్పటి ఈ దాడిలో ఉక్రెయిన్ ప్రజలు ప్రాణాలు కోల్పోగా మరికొందరూ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తున్నది. మరొక వైపు రష్యా తీరుపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆగ్రహమే వ్యక్తం చేస్తూ ఉన్నాయి. రష్యా దాడికి ప్రతి చర్య తప్పదని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు.
Advertisement
చిన్న దేశమైన ఉక్రెయిన్ పై రష్యా అన్యాయంగా దాడి చేస్తుందని ఈ పరిణామాలకు రష్యానే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఉక్రెయిన్ రష్యా దాడి దృశ్యాలను అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు వార్త ఛానెల్స్ ప్రజలకు చేరువచేస్తున్నాయి. ఒక వైపు ఉక్రెయిన్, రష్యాయుద్ధం జరుగుతుండగా తాజాగా ఓ జర్నలిస్ట్ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.
Also Read : యుద్ధం సమయంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్న 350 మంది తెలుగు విద్యార్థులు
Advertisement
క్షణాల వ్యవధిలోనే ఆ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. ఇంతకు అతను ఏమి చేశాడో తెలుసుకుందాం. ప్రస్తుతం ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం ప్రస్తుతం అక్కడ నెలకొన్ని పరిస్థితులను ఆ జర్నలిస్ట్ ఏకంగా ఆరు భాషల్లో వార్తలను అందిస్తున్నారు. ఇంగ్లీషు, లక్సెంబర్గీస్, స్పానిస్, పోర్చుగీస్, ఫ్రెంచ్, జర్మన్‌లతో సహా ఆరు వేర్వేరు భాషల్లో అతను న్యూస్ అందిస్తున్నాడు.
Also Read : IPL 2022 : పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్‌గా మయాంక్ పేరు ఖరారు..!
క్రౌథర్ ది అసోసియేటేడ్ ప్రెస్. అంతర్జాతీయ అనుబంధ కరస్పాండెంట్ ఫిలిప్ క్రౌథర్ ఉక్రెయిన్‌లోని కైవ్ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో వార్తలు చెబుతున్నాడు. ఇదే సమయంలో అతను ఏకంగా ఆరు వేర్వేరు భాషల్లో మాట్లాడాడు. ఈ వీడియోను అతను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. కైవ్ నుంచి ఆరు భాషల్లో న్యూస్ కవరేజీ అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Six-language coverage from #Kyiv with @AP_GMS. In this order: English, Luxembourgish, Spanish, Portuguese, French, and German. pic.twitter.com/kyEg0aCCoT
— Philip Crowther (@PhilipinDC) February 21, 2022