ఒకప్పుడు వయసు పైబడిన వాళ్లకే హార్ట్ ఎటాక్ లు వచ్చేవి. కనీసం ఆరవై దాటిన వాళ్లే హార్ట్ ఎటాక్ ల వల్ల మరణించేవారు. కానీ ప్రస్తుతం యువత సైతం ఈ మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. హర్ట్ ఎటాక్ లు రావడానికి హెల్తీ లైఫ్ స్టైల్ లేకపోవడం….ఫిట్ గా ఉండకపోవడమే కారణాలు అని చెప్పేవారు. కానీ ఇటీవల కాలంలో హెల్తీ లైఫ్ స్టైల్ ను ఫాలో అవుతూ తరచూ ఫిట్నెస్ కోసం కష్టపడిన వాళ్లు కూడా హార్ట్ ఎటాక్ ల బారిన పడి ప్రాణాలు కోల్పోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Advertisement
ముందుగా పునీత్ రాజ్ కుమార్ మరణంతో అంతా షాక్ అయ్యారు. పునీత్ రాజ్ కుమార్ చాలా హెల్తీ లైఫ్ స్టైల్ ను కలిగి ఉంటారు. ఎంతో క్రమశిక్షణతో ఎప్పుడు చూసినా కూల్ గా ప్రశాంతంగా కనిపిస్తారు. అదే విధంగా గంటల తరబడి జిమ్ లో గడుపుతారు. కానీ ఆయన అకస్మాత్తుగా జిమ్ చేస్తూ కుప్పకూలిపోయారు. కేవలం 50 ఏళ్ల వయసులోపే పునీత్ మరణించారు. అదే విధంగా రీసెంగ్ గా ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి కూడా 50 ఏళ్ల వయసులోపై మరణించారు.
Advertisement
ఆయన కటౌట్ చూస్తేనే ఎంత ఫిట్ గా ఉంటారో అర్థం అవుతుంది. ప్రతి రోజూ గౌతమ్ రెడ్డి క్రమం తప్పకుండా జిమ్ చేస్తారు. ఎంతో క్షమశిక్షణగా కూల్ గా కనిపిస్తూ ఉంటారు. ఎప్పుడూ ముఖం పై చిరునవ్వు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆయన కూడా గుండె పోటువల్లే మరనించారు.
also read : ‘భీమ్లానాయక్’ ట్రైలర్ పై శ్రీరెడ్డి సెటైర్లు ! కామెడీ గా ఉంది అంటూ..
అయితే వీరిద్దరి మరణం పై తెలుగు రాష్ట్రాల్లో కొన్నొ అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇద్దరికీ గతంలో కరోనా వచ్చి ఆ తరవాత తగ్గిపోయింది. మంత్రి గౌతమ్ రెడ్డి రెండు సార్లు కరోనా బారిన పడి కోలుకోగా…పునీత్ రాజ్ కుమార్ కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు. కొందర వైద్యలు మరియు శాస్త్ర వేత్తలు కూడా పోస్ట్ కరోనా తరవాత హార్ట్ ఎటాక్ లు వస్తున్నాయని చెబుతున్న సంగతి తెలిసిందే.