మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇవాళ ఉదయం అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు నిన్ననే తిరిగి వచ్చారు. ముఖ్యంగా ఆయన జీవిత ప్రస్తానం ఒక సారి తెలుసుకుందాం.
Also Read : ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి చివరి ఫోటో ఇదే..!
Advertisement
నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కుమారుడు ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖమంత్రి గౌతమ్‌రెడ్డి. 1971 నవంబర్ 02న గౌతమ్‌రెడ్డి జన్మించారు. వీరి స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి. గౌతమ్ రెడ్డి ఐర్లాండ్‌లోని మాంచెస్టర్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ పూర్తి చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికలతో రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఆత్మకూరు నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి గెలుపొందారు.
Advertisement
2019 అసెంబ్లీ ఎన్నికల్లో రెండవ సారి ఆత్మకూరు నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. వైఎస్ జగన్ క్యాబినెట్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా నిన్నటి వరకు పని చేశారు. మేకపాటి గౌతమ్‌రెడ్డికి భార్య శ్రీకీర్తి, కుమార్తె అనన్యరెడ్డి ఉన్నారు. ఏపీ పెట్టుబడులు పెట్టి అందరం ఎదుగుదామంటూ పారిశ్రామిక వేత్తలకు పిలుపునిస్తూ యూ గ్రో విగ్రో అనే నినాదాన్ని మంత్రి మేకపాటి ఇచ్చారు. ముఖ్యంగా మేకపాటి పోస్ట్ కొవిద్ పరిణామాలే గుండెపోటుకు కారణం కావచ్చని భావిస్తున్నారు.
Also Read : సచిన్-అంజలి లవ్‌స్టోరీ.. వారి పెళ్లికి పెద్దలను ఎవరు ఒప్పించారో తెలుసా..?