మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పరిచయం అక్కర్లేని పేరు. మెగాస్టార్ తనయుడిగా చిరుత సినిమాతో రామ్ చరణ్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఈ సినిమా చరణ్ కు అనుకున్న మేర్ హిట్ ఇవ్వకపోయినా చిరుకు తగ్గ తయయుడు అనిపించుకునేలా మెప్పించింది. ఈ సినిమా తరవాత రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. సినిమాలో చరణ్ నటన డ్యాన్సులు ప్రేక్షకులను ఫిదా చేశాయి. ఇక ప్రస్తుతం చరణ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియాకు పరిచయం అవ్వబోతున్నారు.
ఈ సినిమా విడుదలకు ముందే ట్రైలర్ టీజర్ తో రామ్ చరణ్ కు దేశం మొత్తం అభిమానులు అవుతున్నారు. అయితే సినిమాల్లో ఎంతో సక్సెస్ అయ్యిన చరణ్ మొదటి ప్రయత్నంలోనే వ్యాపారంలో నష్టపోయారు. రామ్ చరణ్ తన స్నేహితులతో కలిసి ట్రౌజెట్ అనే విమానయాన సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2015 లో కేంద్ర విమానయానమంత్రి అశోక్ గజపతి రాజు ఈ సంస్థను ప్రారంభించారు.
Advertisement
Advertisement
తక్కవ సమయంలోనే ట్రూజెట్ విస్తరణ జరిగింది. అయితే వెయ్యికోట్ల పైగా బడ్జెట్ తో ప్రారంభించిన ఈ సంస్థ నష్టాల ఊబిలో కూరుకుపోయినట్టు తెలుస్తోంది. ఇటీవలే విమాన సర్వీసులు కూడా నిలిపివేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. అంతే కాకుండా కొంత కాలం తరవత తిరిగి సర్వీసులను ప్రారంభిస్తామని ప్రకటించింది.
also read : శృతిమించిన జబర్దస్త్ కామెడీ….మంగళవారం అంటూ రోజా దారుణమైన బూతు సామెత…!
అయితే అప్పల్లో ఉన్న ఈ సంస్థ కోసం దాదాపు 150 నుండి 200 కోట్లు కావాలట. దాంతో ఒప్పందం కోసం రామ్ చరణ్ ముంబై వెళ్లి టాటా గ్రూప్ ప్రతినిధులతో చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయిందట. మరో వైపు చరణ్ పెద్ద మొత్తంలోపెట్టుబడులు రాబట్టేందుకు ముంబైలో ఇతర బడా వ్యాపారవేత్తలను కూడా కలుస్తున్నారట. తన ఇమేజ్ తో మళ్లీ ట్రూజెట్ ను లాభాల్లోకి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుపుతున్నారట.