భారత్ లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 25,920 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 472 మంది మరణించారు. ఇక తాజాగా 67,254 మంది కరోనా నుండి కోలుకున్నారు.
సమ్మక్క సారక్క మేడారం జాతర జనసంద్రంగా మారింది. గద్దెపైకి సమ్మక్క తల్లి చేరుకుంది. సమ్మక్క వనం వదిలి జనం మధ్యకు వచ్చింది. నిలువెత్తు బంగారంతో భక్తులంతా మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Advertisement
నేడు గుంటూరు జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఉదయం 10:15 గంటలకు సీఎం మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్ ను ప్రారంభించనున్నారు. ఆనంతరం 11 గంటలకు తాడేపల్లి మండలం కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రంలో భూమిపూజ చేయనున్నారు.
అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఈరోజు రెండోరోజు సర్పంచులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. కొత్త సర్పంచ్ లకు టిడిపి అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సదస్సులో ప్రకాశం, నెల్లూరు, తూ.గో జిల్లాల నుంచి గెలుపొందిన సర్పంచులు పాల్గొంటారు.
నేడు మేడారం జాతరకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రేణుక సింగ్ లు విచ్చేస్తున్నారు. వనదేవతలను దర్శించుకోవడం కోసం కేంద్ర మంత్రులు వస్తున్నారు.
Advertisement
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమిని కబ్జాకు యత్నించారు. 1989లో సర్వే నెంబర్ 222/5లో 87 సెంట్లు రిజిస్టర్ భూమిని ఖర్జూర నాయుడు కొనుగోలు చేశారు. అయితే సగం భూమి చంద్రబాబు హాస్పిటల్ కోసం ఇచ్చారు. కాగా మిగిలిన 38 సెంట్ల భూమిలో ఆక్రమణదారులు రాతి కూసాలు నాటారు.
చెన్నైలోని మైలాపూర్ చెందిన రేవతి విశ్వనాథం తిరుమల శ్రీవారికి రూ. 9.20 కోట్ల ఆస్తులు మరియు నగదు విరాళంగా అందజేశారు. తన అన్న డాక్టర్ పర్వతం జ్ఞాపకార్థం ఆస్తిని విరాళంగా ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన ధ్యానేశ్వర్ అనే రైతు సొంతంగా విద్యుత్ బైక్ ను రూపొందించాడు. 40 వేలు ఖర్చు చేసి తన బైక్ కు ఎలక్ట్రిక్ బ్యాటరీ అమర్చాడు. 4గంటలు ఛార్జింగ్ పెడితే బైక్ 100 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తోంది.
సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ముక్రే అనే గ్రామానికి చెందిన ఓ కుటుంబం తమ కుమారుడికి కేసీఆర్ అని పేరు పెట్టి అభిమానాన్ని చాటుకున్నారు.
చైనా కు చెందిన 54 యాప్ ల పై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా చైనా స్పందించింది. చైనాతో పాటు విదేశీ పెట్టుబడిదారులు అందరితో భారత్ పారదర్శకంగా వ్యవహరిస్తుందనని అనుకుంటున్నామని పేర్కొంది. వివక్షపూరిత నిర్ణయాలు భారత్ తీసుకోదు అనుకుంటున్నాము అంటూ వ్యాఖ్యానించింది. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగయ్యేలా చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నామంటూ చైనా వెల్లడించింది.