Home » 17th feb 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

17th feb 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad
INDIA CORONA UPDATE

INDIA CORONA UPDATE

ఇండియాలో గ‌డిచిన 24గంట‌ల్లో 30,757 కొత్త క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. క‌రోనాతో 541 మంది క‌న్నుమూశారు.

తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ ఇంట విషాదం నెల‌కొంది. స‌త్య‌వ‌తి రాథోడ్ తండ్రి లింగ్యానాయక్‌ (85) క‌న్నుమూశారు. ప్ర‌స్తుతం మేడారం జాతర పర్యవేక్షణలో ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి మరణవార్తతో హుటాహుటిన ఇంటికి బ‌య‌లు దేరారు.

Advertisement

హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,400 ఉండ‌గా…. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,200 ల‌కు చేరింది. అదే విధంగా కిలో వెండి ధర రూ. 67,800 గా ఉంది.

తొలి టీ-20లో వెస్టిండీస్‌పై ఆరు వికెట్ల తేడాతో భారత్ విజ‌య‌దుందుబీ మోగించింది. భారత్‌ స్కోర్ 162/4 కాగా వెస్టిండీస్‌ స్కోర్ 157/7 గా ఉంది.

ఏపీ, తెలంగాణ మధ్య పెండింగ్ వివాదాల పరిష్కారం దిశగా కేంద్ర కసరత్తులు చేస్తోంది. నేడు కేంద్ర హోం శాఖ త్రీ మెన్ కమిటీ తొలి సమావేశం నిర్వ‌హిస్తోంది. ఉదయం 11 గంటలకు వర్చువల్ గా ఈ స‌మావేశం జరుగనుంది. అజెండా లోని 5 అంశాల పై స‌మావేశంలో చ‌ర్చించ‌నున్నారు.

Advertisement

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని అరెస్టు పోలీసులు అరెస్ట్ చేశారు. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా రేవంత్ రెడ్డి నిర‌స‌న కార్యక్రమాలకు పిలుపునివ్వ‌డంతో పోలీసులు అరెస్ట్ చేశారు.

ఏపీలోనూ హిజాబ్ ర‌చ్చ మొద‌ల‌య్యింది. బెజవాడలో హిజాబ్ తరహా వివాదం క‌ల‌క‌లం రేపుతోంది. బుర్కా వేసుకొచ్చారని విద్యార్థుల‌ను కాలేజీ యాజమాన్యం అనుమ‌తించ‌లేదు. దాంతో ఫస్ట్ ఇయర్ నుంచి తాము బుర్కాలోనే కాలేజీ వెళ్తున్నామ‌ని విద్యార్ధులు చెబుతున్నారు. ఇప్ప‌టికే ముస్లిం మ‌త‌పెద్ద‌లు కాలేజీ వ‌ద్ద‌కు చేరుకున్నారు.

సీఎం కేసీఆర్ పుట్టినరోజు సంద‌ర్భంగా హీరో నాగార్జున చెంగిచ‌ర్ల వ‌ద్ద 1000 ఎక‌రాల భూమిని ద‌త్త‌త తీసుకున్నారు.

ట్రూజెట్ విమాన స‌ర్వీసులు నిలిచిపోయాయి. ఉడాన్ ప‌థ‌కం కింద ట్రూజెట్ అథ్య‌దిక సేవ‌లు అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా క‌రోనా తీవ్రంగా దెబ్బతీయ‌డంతో స‌ర్వీసుల‌ను నిలిపివేశారు.

cm kcr

cm kcr

సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సంధ‌ర్బంగా సినీరాజ‌కీయ ప్ర‌ముఖులు ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. ఇప్ప‌టికే ప్ర‌ధాని మోడీ, మెగాస్టార్ చిరంజీవి కేసీఆర్ కు సోష‌ల్ మీడియా ద్వారా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు చెప్పారు.

Visitors Are Also Reading