Home » బప్పీలహరి ఎప్పుడు అలా బంగారాన్ని ఎందుకు ధరించి ఉండేవారో తెలుసా ?

బప్పీలహరి ఎప్పుడు అలా బంగారాన్ని ఎందుకు ధరించి ఉండేవారో తెలుసా ?

by Anji
Ad

బాలీవుడ్‌కు డిస్కో మ్యూజిక్‌ను ప‌రిచచ‌యం చేసిన లెజెండ‌రీ సింగ‌ర్ అలోకేశ్ ల‌హిరి అలియాస్ బ‌ప్పి ల‌హిరి. సంగీత ప్ర‌ప‌చంలో బ‌ప్పీ ల‌హిరి స్టైల్ ప్ర‌త్యేక‌మనే చెప్పాలి. త‌న గానంతో మెస్మ‌రైజ్ చేసిన బ‌ప్పీ లహిరి పాట‌ల‌తోనే కాకుండా ప్ర‌త్యేక‌మైన ఆహార్యంతోనూ ప్రేక్ష‌కుల మ‌దిలో నిలిచిపోయారు. చేతికి గోల్డ్ రింగ్స్ న‌ల్ల‌ని క‌ళ్ల‌ద్దాలు, మెడ‌లో కిలోల కొద్ది బంగారు గొలుసులు.. అస‌లు ఆయ‌న న‌డిచి వ‌స్తుంటే బంగార‌మే క‌దిలి వ‌స్తున్న‌ట్టుగా క‌నిపించేది. ఇదే ఆయ‌న‌కు మ‌రింత ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తీసుకొచ్చింది. ముఖ్యంగా బంగారం లేకుండా బ‌ప్పీ ల‌హిరినీ అస్స‌లు ఊహించ‌లేం అనే చెప్ప‌వ‌చ్చు.

Also Read :  ఎన్టీఆర్ స‌మీరారెడ్డి మ‌ధ్య సంబంధం ఏంటి..? ఆ రూమ‌ర్లు ఎందుకు వ‌చ్చాయి…!

Advertisement

Advertisement

 

వ‌య‌స్సు దాటినా ఎప్పుడూ త‌ర‌గ‌ని ఉత్సాహం చెర‌గ‌ని చిరున‌వ్వుతో కనిపించే బ‌ప్పీ ల‌హిరి బంగారం లేకుండా అస‌లు క‌నిపించే వారు కాదు. ఆయ‌న‌కు బంగారం అంటే అంత ఇష్టం. గోల్డ్ ఈజ్ మై గాడ్ అంటుండేరాయ‌న. ఆయ‌న మెడ‌లో ఎప్పుడూ బంగారు ఆభ‌ర‌ణాలు మెరుస్తూ ఉండేవి. దీని వెనకున్న సీక్రెట్ ఏంటి అని ఓ ఇంట‌ర్వ్యూలో ప్ర‌శ్నించ‌గా..?

ఓ హాలీవుడ్ పాప్ సింగ‌ర్‌ను చూశాక త‌న‌కు బంగారం మీద‌నే ప్రేమ పెరిగింద‌ని.. అది అదృష్టాన్ని తెచ్చి పెడుతుంద‌ని చెప్పేవారు. ఓ సాంగ్ రికార్డింగ్ స‌మ‌యంలో దేవుడి బొమ్మ ఉన్న ఓ లాకెట్‌ను మా అమ్మ నాకు బ‌హుమ‌తిగా ఇచ్చింది. పెళ్లి అయ్యాక కూడా నా భార్య ఓ గ‌ణ‌ప‌తి లాకెట్ కూడిన బంగారు గొలుసును ఇచ్చింది. నా మెడ‌లోని గ‌ణ‌ప‌తి న‌న్ను ఎప్పుడూ సుర‌క్షితంగా ఉంచుతుంద‌ని న‌మ్ముతారు. అంతేకాదు నా కెరీర్ ఎదుగుతున్న కొద్ది నా బంగారం మ‌రింత రెట్టింప‌యింద‌ని కూడా పేర్కొన్నారు బ‌ప్పీ ల‌హిరి.

Also Read :  ఉద‌య్ కిర‌ణ్ న‌రేష్ తో మాట్లాడిన చివ‌రి మాట‌లు ఇవే…!

Visitors Are Also Reading