Home » 16th feb 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

16th feb 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad
INDIA CORONA UPDATE

INDIA CORONA UPDATE

దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. ఇండియాలో గడిచిన 24 గంటల్లో కొత్త‌గా 30,615 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.

బీజాపూర్ లో నక్సల్స్ కిడ్నాప్ చేసిన ఇంజనీర్ ను విడుదల చేశారు. ఇంజనీర్ అశోక్ పవార్ , కార్మికుడు ఆనంద్ యాదవ్‌లను నక్సల్స్ విడుద‌ల చేశారు. ఐదు రోజుల క్రితం ఇంజనీర్ ని మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. భ‌ర్త‌కోసం ఇంజ‌నీర్ భార్య అడ‌విలోకి న‌డుచుకుంటూ వెళ్లింది.

Advertisement

హిమాచల్ ప్రదేశ్ సీఎం జై రాం ఠాగూర్, ఏపీ దేవాదాయ మంత్రి వెల్లంపల్లి, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి, చిత్రకూట్ పీఠాధిపతి రామభద్రాచార్యులు, అయోధ్య రామమందిరం ట్రస్ట్ కోశాధికారి గోవిందరాజ్ గిరిజా మహరాజ్ లు నేడు తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు.

రాష్ట్రంలో గంజాయి, మ‌త్తుప‌దార్థాలు, మద్యం అమ్మకాలు, రాష్ట్రంలో మహిళలపై వేధింపులు, హత్యలు, అత్యాచారాలపై సీఎం జగన్ కు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు లేఖ రాశారు.

Advertisement

యూపీలో ఉండాలంటూ యోగీకే ఓటు వేయాలంటూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్య‌లపై మంత్రి కేటీఆర్ కౌంట‌ర్ వేశారు. వాళ్లు నైతికంగా ఇంత‌కంటే దిగ‌జార‌లేర‌ని అనుకుంటున్న సమ‌యంలో బీజేపీ నుండి మ‌రో జోక‌ర్ వ‌చ్చాడంటూ రాజాసింగ్ పై కేటీఆర్ కౌంట‌ర్ వేశారు.

రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్య‌మంత్రి హిమంత చేసిన కామెంట్ల‌పై ఎఫ్ ఐఆర్ న‌మోదు చేయాలంటూ తెలంగాణ పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తూ నేడు నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చారు. దాంతో ఆయ‌న‌ను గృహ నిర్బందం చేశారు.

పిడుగుపాటు నుండి చార్మినార్ ను ర‌క్షించేందుకు చూట్టూ త‌వ్వ‌కాలు జ‌ర‌ప‌గా ఆ త‌వ్వ‌కాల్లో చార్మినార్ భూగ‌ర్భ మెట్లు బ‌య‌ట‌ప‌డ్డాయి.

ప్రముఖ బెంగాలీ గాయ‌ని సంధ్య ముఖ‌ర్జీ క‌న్నుమూశారు. సంధ్య ముఖ‌ర్జీ ఇటీవ‌ల ప‌ద్మ‌శ్రీని తిర‌స్క‌రించి వార్త‌ల్లో నిలిచారు.

ముంబై పేళుళ్ల సూత్ర‌దారి దావూద్ ఇబ్ర‌హీం ఇండ్ల‌పై ఐటీ దాడులు జ‌రుగుతున్నాయి.

ఎన్నిక‌ల వేళ కాంగ్రెస్ కు బిగ్ షాక్ త‌గిలింది. మాజీ కేంద్ర‌మంత్రి అశ్వ‌నీకుమార్ కాంగ్రెస్ తో 46 ఏళ్ల బంధాన్ని తెంచుకున్నారు. పార్టీకి గుడ్ బై చెబుతూ సోనియాగాంధీకి లేఖ రాశారు.

Visitors Are Also Reading