తమిళ హీరో సూర్యను, దర్శకుడు మురుగదాస్‌ను సౌత్ అంతటా బాగా పాపులర్ చేసిన మూవీ గజిని. ముఖ్యంగా కొత్త కథ, అంతేకథగా కథనం, దానికి సూర్య ఔట్‌స్టాండింగ్ ఫర్‌ఫార్మెన్స్ ఘజిని మూవీని ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఒక క్లాసిక్ మూవీగా నిలబెట్టాయి. 12 మంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన ఈ మూవీ ఏకంగా రూ50కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది.
రమణ సినిమా తరువాత మృగదాస్‌కు తమిళంలో స్టార్ డైరెక్టర్ హోదా వచ్చేసింది. తీసిన రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో తన మూడవ సినిమా కూడా అంతే విభిన్నంగా ఉండాలని ఇంగ్లీషు మూవీ మమెంటో ఆధారంగా తన స్టైల్‌లో ఒక కథ రాశారు మురుగదాస్. 2003 నుంచి ఈ కథను తీసుకొని తిరగడం ప్రారంభించారు. తొలుత తనకు బాగా పరిచయం ఉన్న తెలుగు నిర్మాతల దగ్గరికీ వెళ్లాడు. ముఖ్యంగా సురేష్ బాబును కలిసి కథ చెప్పాడు. చాలా రిస్కీ కథ ఎవరు చేస్తారని సురేష్ బాబు అడిగితే మహేష్ బాబు అని అనుకుంటున్న అని చెప్పాడు మురుగదాస్.
Advertisement
మహేష్ ఒప్పుకుంటే మా బ్యానర్‌లో తీయడానికి రెడీ అని సురేష్ బాబు చెప్పాడు. మహేష్‌ను కలిసి కథ చెబితే.. కథ బాగానే ఉందని రిజెక్ట్ చేశారు. అదేవిధంగా విక్టరీ వెంకటేష్‌తో చేద్దామని ప్రయత్నించారు. కానీ ఆయన ఒప్పుకోలేదు. ముఖ్యంగా హీరో గుండు చేయించుకోవాలి. డ్రాయర్‌పై కనిపించాలి. ఒళ్లంతా పచ్చబొట్లు వేయించుకోవాలంటే ఏ స్టార్ మాత్రం రిస్క్ చేస్తాడు. ఆ తరువాత అల్లు అరవింద్‌ను కలిసి పవన్ కల్యాణ్‌తో చేద్దామని చూశాడు. అప్పటికే జానీ ఫెయిల్యూర్‌లో ఉన్న పవన్ దీనిపై అస్సలు ఆసక్తి చూపలేదు. అల్లుఅరవింద్ మాత్రం ఈ కథతో మూవీ చేస్తే వండర్స్ క్రియేట్ చేస్తుందని ఎంకరేజ్ చేశాడు.
Also Read : చిరంజీవి అలా అడగటం నన్ను బాధించింది… తమ్మారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు …!
ఇక తెలుగులో వర్కవుట్ కాదు అని తమిళ హీరోల వెంటపడ్డాడు మృగదాస్. కమలహాసన్ నో చెప్పాడు. విజయ్ వద్దన్నాడు. తమిళంలో కూడా నలుగురు ఐదుగురు హీరోలు రిజెక్ట్ చేశారు. దాదాపు 10 మంది హీరోలు వద్దనుకున్న తరువాత కు అవసరమా ఇది అని ఒక దశలో చిరాకు వేసిందట. తన తొలి మూవీ హీరో అజిత్ వద్దకు వెళ్లి స్టోరీ చెప్పాడు. తన టాలెంట్ ఏమిటో చెప్పిన అజిత్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హమ్మయ్యా అజిత్ లాంటి స్టార్ దొరికాడు. హీరోయిన్‌గా ఆసిన్, శ్రియా, విలన్‌గా ప్రకాశ్ రాజ్, సంగీత దర్శకుడిగా యువన్ శంకర్‌రాజా 2004 మార్చిలో మూవీ అనౌన్స్ చేశారు.
మిరథల్ టైటిల్‌తో అజిత్, ఆసిన్‌తో ఫోటో షూట్ కూడా చేశారు. దాదాపు 15 రోజుల షూటింగ్ కూడా జరిగింది. అంతలోనే అజిత్ ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడంతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా అజిత్‌కు నిర్మాతతో పడలేదని, అజిత్ షెడ్యూల్ చేంజ్ చేయమనడంతో నిర్మాత ఒప్పుకోకపోవడంతో అజిత్ తప్పుకున్నాడట. మాదవన్ చేస్తానని చెప్పినా కానీ తరువాత రిజెక్ట్ చేశాడట. ఇక చేసేది ఏమిలేక నిర్మాతలు ఆ సినిమా నుంచి తప్పుకున్నారు. కానీ మురుగదాస్‌లో కసి.. ఎలాగైనా సరే ఈ సినిమా చేయాల్సిందే అని నిర్ణయించుకున్నారు. విభిన్న నటనతో రెండు సినిమాల్లో నటించిన సూర్యను కలిశాడు మృగదాస్.
Advertisement
కథ విన్నాక ఇలాంటి రోల్స్ కోసం కదా నేను ఎదురు చూస్తుంది అని సూర్య ఒప్పుకున్నారు. దానికోసం ఆయన గుండు చేయించుకోవడంతో పాటు మానసిక స్థితి సరిగ్గా లేని వారిని కలిసి వారితో మాట్లాడి వారి బిహేవియర్ ఎలా ఉందో తెలుసుకుని అంతా కెమెరాలో రికార్డు చేసుకున్నారు. ఇంటికి వచ్చాక ఆ వీడియో చూస్తూ వారిలా నడవడం, ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం ప్రాక్టిస్ చేసేవారు సూర్య. క్యారెక్టర్‌కు అనుగుణంగా తనను తాను మలుచుకోవడం ఎలాగో చాలా కష్టపడ్డారు. ప్రకాశ్ రాజ్ బిజీగా ఉండడంతో విలన్ పాత్ర ప్రదీప్ రావత్‌కు వెళ్లిపోయింది. సంగీత దర్శకుడిగా హరీష్ జయరాజ్, ఫిబ్రవరి 11, 2005లో ప్రారంభమైంది.
Also Read : భీమ్లా నాయక్ పాటకు మొగులయ్య ఎంత తీసుకున్నారో తెలుసా..!
సూర్య-మురుగదాస్ తొలి చిత్రం ప్రారంభం అయింది. ఆ సినిమాకు టైటిల్ ఘజిని. చెన్నై, ఏవీఎన్ స్టూడియో, లండన్‌లలో షూటింగ్ చేశారు. స్విట్జర్లాండ్‌లో రెండు పాటలను చిత్రీకరించారు. 92 వర్కింగ్ రోజుల్లోనే సినిమా పూర్తి చేశారు. రూ.10కోట్ల బడ్జెట్‌తో చేశారు. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా చేసిన నయనతారకు అసలు పాటలు లేవు. చంద్రముఖి హిట్ తరువాత ఆమె కోసం ఒక స్పెషల్ సాంగ్ పిక్చరైజ్ చేశారు. ఇందులో హీరోయిన్ పేరు కల్పన. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళగా అడుగుపెట్టింది.
ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని 2005 సెప్టెంబర్ 29న తెలుగు, తమిళం, మలయాళంలలో విడుదల అయింది. ఒక మాదిరి అంచనాలతో సినిమాకు వెళ్లిన వారికి మైండ్ పోగోట్టింది. ముఖ్యంగా 15 నిమిషాలకొకసారి గతం మరిచిపోయే షార్ట్‌టర్మ్ మెమొరీ లాస్ ఉన్న హీరో క్యారెక్టర్ వింతగా అనిపిస్తుంది. ప్లాష్ బ్యాక్ అంతా ఒకేసారి చెప్పకుండా మధ్య మధ్యలో చూపించడం ఆడియన్స్ ను ఉత్కంఠకు లోన్ చేసి కథలో ఇన్వాల్ అయ్యేలా చేస్తుంది. ఇలాంటి కొత్త కథ, కథనంలో కూడా హీరో ఎలివెన్స్ ఉన్నాయి. ఇందులో సూర్య ఉన్న ప్రతీ సీన్ హైలెట్ అని చెప్పవచ్చు.
ఈ సినిమా హిట్ అయిన తరువాత చాలా మంది తెలుగు హీరోలు ఈ సినిమాను రీమెక్ చేయమని కోరారట. హరీస్‌జయరాజ్ సంగీతం అద్భుతమనే చెప్పాలి. హృదయం ఎక్కడ ఉంది, ఒకమారు సాంగ్ మామూలుగా హిట్ కాలేదు. నిన్న మొన్నటి వరకు చాలా మంది రింగ్‌టోన్‌గా కూడా పెట్టుకున్నారు. ఆసిన్ ఇంట్రడక్షన్ సీన్‌కు అందించిన మ్యూజిక్ మనస్సుకు హాయిని ఇస్తుంది. సూర్య, ఆసిన్‌ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ మొత్తానికి వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా గ్రేట్ అని చెప్పవచ్చు. సూర్య యాక్టింగ్ చూస్తుంటే.. ఈ సినిమా వదులుకున్న 12 మంది బాధపడటం ఖాయం.
అసలు ఒక హీరో ఇలాంటి పాత్రను అంతలా రక్తి కట్టించడం అంటే మామూలు విషయం కాదు. తన నటన, ఎక్స్ ప్రెషన్స్ చాలా అద్భుతం. ఈ సినిమా సూపర్ స్టార్‌ను చేసింది. ఈ సినిమా విడుదలైన తరువాత కేవలం అర్బన్ ఆడియన్స్ కోసమే అని రివ్యూలు రాశారు. కానీ బీ, సీ సెంటర్లలో కూడా ఈ సినిమా సూపర్ మిట్ సాధించింది. గజిని బాక్సాపీస్ విషయానికి వస్తే 126 కేంద్రాల్లో 50 రోజులు, 62 కేంద్కరాల్లో 100 రోజులు ప్రదర్శించబడింది. మొత్తానికి 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. 2005లో చంద్రముఖి, అపరిచితుడు రికార్డులు సృష్టించగా.. అదే సమయంలో గజిని విడుదలవ్వడంతో మూవీ బాక్సాపీస్ వద్ద అంతగా ఫోకస్ చేయలేదు. తెలుగులో అల్లుఅరవింద్ గజిని రైట్స్‌ను 3 కోట్లకు కొనగా.. ఏకంగా 10కోట్ల షేర్ వసూలు చేసింది.
42 కేంద్రాల్లో 50 రోజులు, 18 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది గజిని. తెలుగులో రజినీకాంత్, కమల్‌హాసన్‌ల తరువాత అత్యధిక మార్కెట్ ఉన్న హీరో సూర్య. దానికి ఊతం ఇచ్చింది గజిని. ఈ సినిమా విజయంతో అంతకు ముందు తమిళ సినిమాలు అన్ని వరుసగా వచ్చాయి. సూర్యను నటుడిగా, సౌత్ సూపర్ స్టార్ హీరోగా నిలబెట్టిన గజిని తన లైప్‌లో ఎప్పటికి మరిచిపోలేని సినిమా.
Also Read : బండ్ల గణేష్ ఆ రాజకీయనాకుడికి బినామీ ?