చినజీయర్ స్వామి అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి అన్న పేరు చాలా మందికి తెలియదు. కానీ చినజీయర్ స్వామిజీ అంటే మాత్రం టక్కున గుర్తు పట్టేస్తారు. ఆయన పలు ఆధ్యాత్మిక ప్రవచనాలు కూడా ఇస్తూ.. ప్రజలకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రబోధిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చినజీయర్ స్వామిజీ తెలియని వారుండరు. హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు నిర్వహిస్తున్న విషయం తెలిసినదే.
భారీ సమతా మూర్తి రామానుజాచార్యుల వారి పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రధాని మోడీ కూడా విచ్చేశారు. దీంతో ఈ అంశం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భారీ విగ్రహం ఏర్పాటు చేయడంలో చినజీయర్ స్వామి కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ప్రజలందరీ దృష్టి ఈ విగ్రహం పైనే ఉంది. దీంతో అసలు ఈ చినజీయర్ స్వామిజీ ఎవరు..? ఆయన జీవితం ఎక్కడ ప్రారంభమైంది..? అని ఆయన గురించి చాలా మంది తెలుసుకోవడం ప్రారంభించారు. ముఖ్యంగా దేశ ప్రధాని, హోంమంత్రి, రాష్ట్రపతి వంటి వారు సహస్రాబ్ది వేడుకలకు హాజరు కావడంతో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
Advertisement
చినజీయర్ స్వామి ఓ సాధారణ వైష్ణవ బ్రాహ్మణ కుటుంబంలో 1956 నవంబర్ 03న చినజీయర్ స్వామి జన్మించారు. వారి తల్లిదండ్రులు తొలుత శ్రీమన్నానారాణాచార్యులు అని నామకరణం చేశారు. ఆయన గౌతమ విద్యాపీఠంలో వైష్ణవ సంప్రదాయాలు, వేద గ్రంథాల పైన శిక్షణ పొందారు. అదేవిధంగా నల్లాన్ చక్రవర్తుల రఘునాథచార్యస్వామి వద్ద సంస్కృతాన్ని తర్క శాస్త్రాన్ని అభ్యసించారు. అదేవిధంగా రాజమండ్రిలోనే ఓరియంటల్ స్కూల్లో పదోతరగతి వరకు చదువుకున్నారు. అయితే ఆ సమయంలోనే ఆయన తండ్రి స్వర్గస్తులయ్యారు.
Advertisement
ఆయన పై కుటుంబ పోషణ భారంపడింది. దీంతో ఆయన ఏదైనా ఉద్యోగం చేయాలనుకున్నారు. ఉద్యోగం కోసం ఒక్క చేతి సంచితో హైదరాబాద్కు చేరుకున్నారు. తొలుత ఎన్నో చేదు అనుభవాల తరువాత ఓ చిన్న ఉద్యోగం లభించింది. ఇక్కడే టైపు, షార్ట్ హ్యాండ్ను కూడా నేర్చుకున్నారు. ఆ తరువాత ఉద్యోగంలో మరొక మెట్టు పైకి ఎక్కారు. ఆ సమయంలో అనగా 1975 నాటికి ఓ సారి పెద్ద జీయర్ స్వామిజీ కాకినాడకు విచ్చేసారు. ఓ యజ్ఞం నిమిత్తం ఆయన విచ్చేస్తారు. యజ్ఞ క్రతువు సాగిస్తుండగా.. అనుకోకుండా పెద్ద జీయర్ స్వామిజీతో శ్రీమన్నారాయణచార్యులకు పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో తనకు ఓ స్టెనోగ్రాఫర్ కావాలని పెద్ద జీయర్ స్వామి కోరడంతో ఆ పని తానే చేస్తానని అప్పటి తాను టైప్, షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నానని చినజీయర్ స్వామిజీ చెప్పారు.
Also Read : తగ్గేదె లే….బాలయ్య టాక్ షో మరో రికార్డు…!
తన ఇంట్లో తల్లి వద్ద అనుమతి తీసుకున్న శ్రీమన్నారాయణాచార్యులు పెద్ద జీయర్ స్వామిజీ వెంటే తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తరువాత 23 ఏండ్ల వయస్సులో ఆయన తల్లి అనుమతితో సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు ఆయన గీతాజ్యోతి ఉద్యమాన్ని మొదలు పెట్టారు. భగవద్గీతకు ప్రాచుర్యం తీసుకురావడంతో పాటు సమాజంలో బద్ధకాన్ని తొలగించి ప్రజల మధ్య సౌభాతృత్వ భావనను పెంపొందించే లక్ష్యంతో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. అంధుల కోసం కళాశాల నిర్మించారు. వారికి కళ్లు లేకున్నా కంప్యూటర్ శాస్త్రంలో నిపుణులు అవ్వాలని కృషి చేశారు.
అంధుల కోసం కళాశాల కట్టించారు. వారికి కళ్లు లేకున్నా కంప్యూటర్ శాస్త్రంలో నిపుణులు అవ్వాలని కృషి చేశారు. అంధులకు శిక్షణ ఇవ్వడం కోసం నిపుణులను కూడా నియమించారు. అంతేకాడు. సమస్త జీవకోటికి జ్ఞానాన్ని అందించే వేద విద్య సారాన్ని అందరికీ అందించడం కోసం ఆయన ఎన్నో ఆశ్రమాలను స్థాపించారు. వేద పాఠశాలలను గురుకుల పాఠశాలలుగా తీర్చిదిద్దారు. అక్కడ అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. అంతేకాదు, ఆయన 12 నెలల్లో 12 భాషలను నేర్చుకున్నారు. శ్రీరామనగరం, శంషాబాద్ లో జిమ్స్ అనే ఆసుపత్రిలో ఉచిత వైద్య విధానాన్ని అమలు చేసి వైద్య రంగాన్ని కూడా అనుగ్రహించారు. పొట్టకూటి కోసం హైదరాబాద్ కు వచ్చి నేడు ప్రపంచానికే సమతామూర్తిని అందించిన ఘనత చినజీయర్ స్వామిజీకే దక్కుతుంది.
Also Read : ఎం ఎస్ నారాయణ కొడుకుకి టాలీవుడ్ లో ఘోర అవమానం .! ఛాన్స్ కోసం వెళితే..!