ఐపీఎల్ 2022 సీజన్‌కు లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంచైజీలు గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో లక్నో ఇదివరకే జట్టు పేరుతో పాటు లోగోను సైతం ఆవిస్కరించగా.. తాజాగా సీవీసీ క్యాపిటల్ ఇవాళ తమ జట్టు పేరును అహ్మదాబాద్ టైటాన్స్‌గా ప్రకటించింది. మెగా వేలానికి కేవలం ఐదు రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో సీవీసీ సంస్థ హడావుడిగా జట్టుకు నామకరణం చేసింది. జట్టు లోగోను ఆవిష్కరించాల్సి ఉంది. కాగా బెంగళూరు వేధికగా ఐపీఎల్ మెగా వేలం ఈనెల 12, 13 తేదీల్లో జరుగనున్న విషయం తెలిసినదే.
అహ్మదాబాద్ టైటాన్స్ రూ.5625 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన సీవీసీ క్యాపిటల్ పార్ట్నర్ గ్రూప్.. జట్టు కెప్టెన్‌గా టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యాను ఎంచుకుంది. ఇందుకు అతనికి రికార్డు స్థాయిలో రూ.15 కోట్లు చెల్లించింది. అలాగే రషీద్‌ఖాన్ కు 15కోట్లు శుభ్‌మన్ గిల్‌ను 8 కోట్లకు డ్రాప్ట్ చేసుకుంది. వీరితో పాటు కోచ్‌గా ఆశీష్ నెహ్రాను మెంటార్ గా గ్వారీ కిర్‌స్టన్‌ను నియమించుకుంది.
Advertisement
Advertisement
మరొక వైపు రూ.7090 కోట్లు పెట్టి లక్నో ఫ్రాంచైజీని చేజిక్కించుకున్న ఆర్పీఎస్ గోయింకా సంస్థ తమ జట్టు పేరును లక్నో సూపర్ జెయింట్గా కే.ఎల్. రాహుల్ 17 కోట్లు, కెప్టెన్‌గా ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్స్టొయినీస్ 9.2 కోట్లు, రవి బిష్ణోయ్ 4 కోట్లు డ్రాప్ట్లుగా ఎంచుకుంది. ఈ జట్టుకు కోచ్‌గా ఆండీ ప్లవర్ వ్యవహరించనుండగా.. మెంటార్‌గా గౌతం గంబీర్ నియమితుడు అయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇటీవలే తమ లోగోను కూడా ఆవిష్కరించింది.