హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని ముచ్చింతల్ చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలోని శ్రీరామనగరంలో సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల భారీ విగ్రహాన్ని ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు ప్రధాని. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించిందన్నారు.
Advertisement
Advertisement
తెలుగు సినిమా సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతాలు సృష్టిస్తోందని కొనియాడారు. అదేవిధంగా విశ్వవ్యాప్తమైందని, తెలుగు భాష, చరిత్ర, సినిమా సుసంపన్నమైందని కీర్తించారు. అలాగే తెలంగాణ గొప్ప పర్యాటక ప్రాంతంగా ఎదుగుతుందని ప్రధాని ప్రశంసించారు. రామప్ప ఆలయానికి ఇప్పటికే యూనెస్కో గుర్తింపు లభించిందని, పోచంపల్లికి ప్రపంచ పర్యాటక గ్రామ పురస్కారం లభించిందని ప్రధాని వెల్లడించారు. ప్రపంచ తలమానికంగా సమతా విగ్రహం వెలుగొందుతుందని ప్రధాని పేర్కొన్నారు. రామానుజాచార్యులు ఆనాడే దళితులను కలుపుకుని ముందుకు సాగారన్నారు. అప్పుడే దళితులకు దర్శన భాగ్యం కల్పించారని గుర్తు చేశారు.
Also Read : రష్యాలోని టెంబులాట్ ఎర్కెనోవ్ కోట ప్రత్యేకత గురించి తెలుసా..?