రోడ్డుపై వీసమెత్తు బంగారం కనిపిస్తేనే వదలరు. అలాంటిది ఏకంగా 186 కిలోల బంగారం కనిపిస్తే చూస్తూ ఎవరైనా ఊరుకుంటారా చెప్పండి. అయితే అంత పెద్ద మొత్తంలో ఒకేచోట ఉండడంతో చూసిన ప్రజలు కూడా షాక్‌కు గురయ్యారు. సూర్యకాంతిలో మెరిసిపోతున్న దానిని చూసి.. ముట్టుకుంటూ ఫొటోలు కూడా దిగారు. 186 కిలోల 24 క్యారెట్ల బంగారంతో జర్మనీకి చెందిన నిక్లాస్ కాస్టెలక్ష అనే ఆర్టిస్ట్ గోల్డెన్ క్యూబ్‌ను తయారు చేసాడు. ఈ గోల్డెన్ క్యూబ్ ను న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్కులో ఉంచారు. అక్కడికి వచ్చిన ప్రజలు ఆ గోల్డెన్ క్యూబ్‌ను చూసి షాక్ అయ్యారు. దాని దగ్గర కొందరూ ఫొటోలు దిగారు.
Advertisement
Advertisement
ఇందతా నిక్లాస్ ఎందుకు చేశారంటే పబ్లిసిటీ స్టంట్ కోసమే చేసాడట. త్వరలోనే నిక్లాస్ కాస్టెలో కాయిన్‌పేరుతో క్రిప్టోకాయిన్ లాంచ్ చేయబోతున్నారు. దీని కోసం ఆయన ఈ విధంగా చేసారట. న్యూయార్క్ సెంట్రల్ పార్కు నుంచి గొల్డెన్ క్యూబ్‌ను ప్రయివేటు డిన్నర్‌కు తరలించారు. ఆ ప్రయివేటు డిన్నర్‌లో పలువురు సెలబ్రిటీలు కూడా పాల్గొని గోల్డెన్ క్యూబ్ ఫొటోలు దిగారు అంట. ఇక ఈ గోల్డెన్ క్యూబ్ ను తయారు చేయడానికి సుమారు రూ.88 కోట్లు ఖర్చు అయినట్టు నిక్లాస్ కాస్టెలో పేర్కొన్నారు.
Also Read : వైరల్ అవుతున్న కరిష్మా తన్నా మెహందీ ఫొటోలు