సిద్దూ జొన్నలగడ్డ కథానాయకుడిగా, టైటిల్ పాత్రలో నటించిన సినిమా డీజే టిల్లు అట్లుంటది మనతోని అనేది ఉపశీర్షిక. సితార ఎంటర్టైన్ మెంట్స్ నిర్మాణ సంస్థ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇది. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఈ చిత్రానికి. ఇందులో నేహాశెట్టి కథానాయికగా నటించస్తున్నది. అయితే ఇటీవలే ఈ చిత్రం యొక్క ట్రైలర్ విడుదల చేసినప్పుడు ఫిబ్రవరిలో విడుదల చేస్తాం అని చెప్పారు. కానీ పోస్టర్ మీద విడుదల ఎప్పుడు అనేది మాత్రం వేయలేదు.
Also Read : ఆసియాలోనే అతిపెద్ద కాలనీ.. ఎక్కడో తెలుసా..?
Advertisement
ఈనెల 11న విడుదల చేయాలని అనుకుంటున్నట్టు వెల్లడించారు. కానీ ఇవాళ తాజాగా అధికారికంగా విడుదల తేదీని ప్రకటించారు. ఫిబ్రవరి 11న విడుదల కాదు.. ఫిబ్రవరి 12న డీజే టిల్లు సినిమాను విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఇటీవల విడుదల చేసిన డీజే టిల్లు ట్రైలర్ యూత్‌ను ఎట్రాక్ట్ చేస్తున్నది. ముఖ్యంగా హీరో హీరోయిన్స్ మధ్య సీన్స్ ఆకట్టుకున్నాయి. కాసర్ల శ్యామ్ రాసిన డీజే టిల్లు టైటిల్ సాంగ్‌ను కొన్ని రోజుల క్రితమే విడుదల చేశారు.
Advertisement
సంగీత దర్శకుడు రామ్ మిరియాల సంగీతమందించడంతో పాటు స్వయంగా పాడిన ఆ గీతానికి మంచి స్పందన లభించినది. అదేవిధంగా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఆలపించిన రాజా రాజా ఐటమ్ రాజా.. రోజా రోజా క్రేజీ రోజా పాటకు మంచి స్పందన లభించినదని చిత్రబృందం పేర్కొంటున్నది. ఆ పాటకు శ్రీచరణ్ పాకాల స్వరాలను అందించారు. ఈ సినిమాకు థమన్ నేపథ్య సంగీతమందించారు. ఫ్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి నర్రా శ్రీనివాస్ నటించిన ఈ చిత్రమునకు పీడీవీ ప్రసాద్ సమర్పకులు విమల్ కృష్ణతో కలిసి సిద్దూ జొన్నలగడ్డ కథ రాసారు. ఈ మధ్యనే డీజీ ట్రిల్లు ట్రైలర్ విడుదల సమయంలో ఓ విలేకరీ అడిగిన ప్రశ్న వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే హీరో సిద్ధు సమాధానం చెప్పాడు. ఇలాంటి ప్రశ్న అడగడం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. మహిళలకు సిద్దు ఎంతో ప్రాధాన్యత గౌరవం ఇస్తాడని నేహాశెట్టి వెల్లడించిన విషయం తెలిసిందే.
Also Read : ఎమ్మెల్యే రోజా తీవ్ర అసంతృప్తి.. అవసరమైతే రాజీనామాకు సై..?