Home » ఎమ్మెల్యే రోజా తీవ్ర అసంతృప్తి.. అవ‌స‌ర‌మైతే రాజీనామాకు సై..?

ఎమ్మెల్యే రోజా తీవ్ర అసంతృప్తి.. అవ‌స‌ర‌మైతే రాజీనామాకు సై..?

by Anji
Ad

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప‌ద‌వులు చిచ్చు పెడుతూ ఉన్నాయి. తాజాగా జ‌రిగిన ప‌రిణామాల‌పై ఆమె ఆవేద‌న‌కు గురైంది ఎమ్మెల్యే ఆర్‌.కే. రోజా. అవ‌స‌ర‌మ‌యితే రాజీనామాకు కూడా సిద్ధ‌మ‌ని పేర్కొన్నారు. ఇంత‌కు ఆమె అసంతృప్తికి కార‌ణం ఏమిటంటే..? శ్రీ‌శైలం బోర్డు చైర్మ‌న్ నియామ‌క‌మేన‌ట‌. తాజాగా శ్రీ‌శైలం బోర్డు చైర్మ‌న్‌గా చెంగారెడ్డి చ‌క్ర‌పాణిరెడ్డిని నియ‌మించారు సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి.

Advertisement

Advertisement

అయితే ఈ వ్య‌వ‌హారం రోజాకు మింగుడు ప‌డ‌డం లేద‌ట‌. చ‌క్ర‌పాణిరెడ్డికి ప‌ద‌వీ ఇవ్వ‌డంపై రోజా అసంతృప్తిగా ఉన్న‌ట్టు స‌మాచారం. స్థానిక ఎన్నిక‌ల్లో రోజా, చక్ర‌పాణిరెడ్డి మ‌ధ్య వివాదం చోటు చేసుకున్న‌ది. తాజాగా ఆయ‌న‌కు ప‌ద‌వీ రావ‌డంపై ఆవేద‌న‌కు గురైంది రోజా. ఈ వ్య‌వ‌హారాన్ని సీఎం జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లుతా అని పేర్కొన్నారు. ముఖ్యంగా రోజా అవ‌స‌ర‌మ‌యితే ఎమ్మెల్యే ప‌ద‌వీకి సైతం రాజీనామా చేస్తాను అని ప్ర‌క‌ట‌న చేశారు. ఈ వ్య‌వ‌హారం ఎక్క‌డి వ‌ర‌కు దారి తీస్తుంద‌నేది వేచి చూడాలి. టీక‌ప్పులో తుఫాన్‌లాగా మారిపోతుందా లేక రాజీనామా వ‌ర‌కు వెళ్లుతుందా అనే ఇప్పుడు ఎంతో ఆస‌క్తిక‌రంగా మారింది.

Also Read :  ఆసియాలోనే అతిపెద్ద కాల‌నీ.. ఎక్క‌డో తెలుసా..?

Visitors Are Also Reading