పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిగ్నిటీ హౌసింగ్ స్కీమ్ కింద నిర్మించిన 112 బ్లాకుల్లో 15,600 నివాస సముదాయాలతో ఆసియాలోనే అతిపెద్ద హౌసింగ్ కాలనీని త్వరలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. ఖైరతాబాద్‌లోని ఇందిరానగర్‌లో డబుల్ బెడ్రూం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలఫ్‌మెంట్ మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని ప్రకటించారు. అన్ని సౌకర్యాలతో గౌరవ ప్రదమైన నివాసాన్ని అందించడమనేది ఒక రకమైన భావన. ముఖ్యంగా దేశంలోని ఏ మెట్రో నగరాలలోనూ పేదల కోసం ఉచితంగా ఎలాంటి లింకేజ్ లేదా బ్రోకర్ల ప్రమేయం లేకుండా అందించబడే ఆఫర్ లేదని పేర్కొన్నారు.
Advertisement
Advertisement
ఇందిరానగర్ 2బీహెచ్‌కే ప్రాజెక్ట్ 17.85 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించబడింది. ఇందులో 210 నివాస యూనిట్లు ఉన్నాయి. ఇందిరానగర్ కాలనీ హుస్సెన్ సాగర్ సెక్రెటేరియట్ చుట్టూ సిటీ సెంటర్ ఉంది. ప్రాజెక్ట్ అన్ని అవసరమైన సౌకర్యాలతో అమర్చబడింది. లిప్టులు, తాగునీటి సరఫరా, షాపింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి. ఈ ప్రదేశంలో ప్రయివేటు బిల్డర్ల నుంచి ఇదే విధమైన నివాస యూనిట్ కు ఎక్కడైనా రూ.50లక్షలు నుంచి రూ.60లక్షల వరకు ఖర్చవుతుంది. కానీ పేద కుటుంబాలు గౌరవప్రదంగా జీవించాలని కోరుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ యూనిట్లను ఉచితంగా అందించారని వెల్లడించారు కేటీఆర్.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రూ.18,000 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా పేదల కోసం డిగ్నిటీ హౌసింగ్ స్కీమ్‌ను చేపట్టింది. ఇందులో హైదరాబాద్‌లో రూ.9,714 కోట్లతో 2 బీహెచ్‌కే హౌసింగ్‌ను చేపట్టింది. మంత్రి ఇక్కడ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణాన్ని కూడా ప్రకటించాడు. ఇందిరానగర్‌కు అనుకుని హెచ్ఎండీఏకు చెందిన ఎకరం భూమి అందుబాటులో ఉందని, జీహెచ్ఎంసీకి అప్పగిస్తాం అని చెప్పారు కేటీఆర్.
Also Read : భర్త సినిమాల్లో సుహాసిని నటించకపోవడానికి కారణం ఏంటో తెలుసా..!