ఆడపిల్లను చిన్నప్పటి నుంచి ఎంతో ఆప్యాయంగా పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులు పెళ్లి వయస్సు రాగానే పెళ్లి చేసి ఆమెకు కట్నకానుకలు అందజేయడంతో పాటు నగలు, నగదు పొలం ఇలా ఎవరికీ తోచినది వారు ఇస్తుంటారు. కానీ కేరళకు చెందిన షెహ్నా షేరి అనే యువతి మాత్రం స్తోమత ఉన్నప్పటికీ నగలు లేకుండానే వివాహం చేసుకుంది. అందుకు అయ్యే ఖర్చును 7 పేద కుటుంబాలకు సాయంగా పంపిణీ చేసింది.
Advertisement
కేరళలోని కోజీకోడ్ జిల్లా యమపయ్యూర్‌కు చెందిన ఆంత్రురంలా దంపతుల కుమార్తె షెహ్నాపెరికి కొట్టపల్లికి చెందిన మహ్మద్ షఫీతో వివాహం కుదిరింది. షెహ్నా తన వివాహమును సాధారణంగా జరుపుకొని మిగిలే డబ్బులతో పేదలకు సహాయం చేయాలనుకున్నది. ఆమె తీసుకున్న నిర్ణయాన్ని తన తల్లిదండ్రులు, తన భర్త అంగీకరించడంతో పెళ్లితంతును నిరాడంబరంగా ముగించారు.
Advertisement
ముఖ్యంగా పెళ్లి వేదికపైనే 21 సెంట్ల భూమిని నాలుగు నిరుపేద కుటుంబాలకు పంపిణీ చేశారు. అదేవిధంగా ఒక పేద వ్యక్తికి ఇంటిని కూడా నిర్మించి ఇచ్చరు. మరొకరికీ ఆసుపత్రిలో చికిత్సకు అవసరమయ్యే డబ్బును అందజేశారు. ఓ పేద అమ్మాయి వివాహ ఖర్చును భరించారు. దగ్గరలోని డయాలసిస్ సెంటర్ కు కూడా విరాళం ఇచ్చారు. ఇతా తమ సంతోషాన్ని నలుగురికీ పంచి ప్రశంసలు అందుకుంది ఆ వధువు.
Also Read : మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు సినిమా పరిశ్రమ తరలించడంలో ఆ నటుడిదే కీలక పాత్ర