ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు రీసెంట్ గా కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో పద్మశ్రీని దక్కించుకున్న సంగతి తెలిసిందే. గరికపాటి తన ప్రసంగాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. రాజకీయ, సామాజిక, సినిమా ఇలా ప్రతిదానిపై గరికపాటి ముక్కుసూటిగా మాట్లాడుతూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో గరికపాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పద్మశ్రీ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని గరికపాటి వ్యాఖ్యానించారు. ఈ సంధర్భంగా రీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమా పుష్పపై విమర్శలు కురిపించారు. రీసెంట్ గా వచ్చిన పుష్ఫ సినిమాలో స్మగ్లింగ్ చేసేవాడిని హీరోగా చూపించారని అన్నారు. చివరిలో 5 నిమిషాలు మంచిగా చూపిస్తామని..పుష్ప 2 లో చూపిస్తామని చెబుతున్నారని అప్పటి వరకూ సమాజం చెడిపోదా అంటూ మండిపడ్డారు.
Advertisement
Advertisement
పుష్ఫ సినిమా హీరో గానీ డైరెక్టర్ గానీ దీనిపై తనకు సమాధానం చెప్పాలని గరికపాటి నిలదీశారు. ఇంకా తగ్గేదే లే అంటూ స్మగ్లర్లకు డైలాగులు ఏంటని ప్రశ్నించారు. దొంగతనాలను స్మగ్లింగ్ ను సంచలనం చేస్తున్నారని అన్నారు. హీరో హీరోయిన్ కోసం దొంగతనం చేసి హీరో అవుతున్నాడని అన్నారు. సినిమాలు సీరియల్స్ ఇలా ఉండటం వల్ల చెడిపోతున్నారని అన్నారు.
మంచి తనం ఉన్న హీరోను చూపించిన సినిమా ఒక్కటైనా వస్తుందా….వస్తే ఆడుతుందా ఆడకపోతే వదిలేయండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి దండ్రులు పిల్లల మార్కులు చూసి వాడిని హీరోను చేయొద్దని గరికపాటి అన్నారు. అలా చేస్తే వాడు చివరికి జీరో అవతాడంటూ వ్యాఖ్యానించారు.
also read : పవన్ కల్యాణ్ సినిమాకు కొరియాగ్రఫర్ గా పనిచేసిన బన్నీ..ఏ సినిమాకో తెలుసా..?