Home » ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాకు కొరియాగ్ర‌ఫ‌ర్ గా ప‌నిచేసిన బ‌న్నీ..ఏ సినిమాకో తెలుసా..?

ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాకు కొరియాగ్ర‌ఫ‌ర్ గా ప‌నిచేసిన బ‌న్నీ..ఏ సినిమాకో తెలుసా..?

by AJAY
Ad

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ఫ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. కొంత కాలంగా అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ అని కూడా అంటున్నారు. అల్లు అర్జున్ కు ఐకాన్ స్టార్ అనే పేరు భాగా సెట్ అవుతుంద‌ని ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా ఫంక్ష‌న్ లో తెలిపారు. అప్ప‌టి నుండి స్టైలిష్ స్టార కాస్తా ఐకాన్ స్టార్ గానూ పాపుల‌ర్ అయ్యాడు. ఇక టాలీవుడ్ లోని బెస్ట్ డ్యాన్స‌ర్ ల‌లో అల్లు అర్జున్ కూడా ఒక‌రు. న‌ట‌నతోనే కాకుండా అల్లు అర్జున్ త‌న డ్యాన్స్ ల‌తోనూ ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు.

pawan kalyan allu arjun

pawan kalyan allu arjun

ముఖ్యంగా ఆర్య 2 సినిమా నుండి అల్లు అర్జున్ డ్యాన్స్ కు ఎంతో మంది అభిమానులు అయ్యారు. ఇక ఆ త‌ర‌వాత చాలా సినిమాల్లో బ‌న్నీ త‌న డ్యాన్సింగ్ టాలెంట్ ను చూపించాడు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ఓ సినిమాకు కొరియోగ్రాఫ‌ర్ గా కూడా ప‌నిచేశారు.కానీ ఈ సంగ‌తి ఎవ‌రికీ తెలియ‌దు. అంతే కాకుండా ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాకు బ‌న్నీ కొరియోగ్రాఫ‌ర్ గా ప‌నిచేయ‌డం చెప్పుకోద‌గ్గ విష‌యం.

Advertisement

Advertisement

pawan kalyan allu arjun

2004లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన సినిమా గుడుంబా శంక‌ర్. ఈ సినిమాకు వీర శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిచారు. నాగ‌బాబు ఈ చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఇక ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కు జోడీగా మీరా జాస్మీన్ న‌టించింది.

gudumba shankar

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎగిరే చిల‌క‌మ్మా అనే సాంగ్ ను చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. అయితే ఈ పాట‌కే అల్లు అర్జున్ కొరియోగ్రాఫ‌ర్ గా చేశార‌ట‌. కానీ ఈ సంగతి చాలా మందికి తెలియ‌దు. ప్ర‌స్తుతం ఈ విష‌యం వైర‌ల్ అవుతుండ‌టంతో అల్లు అర్జున్ అభిమానులు షాక్ అయ్యారు.

also read : 40 ఏళ్ల ప్ర‌స్థానంలో చిరు ముద్దుపెట్టిన ఒకేఒక్క హీరోయిన్ ఎవ‌రో తెలుసా..!

Visitors Are Also Reading