Home » 2nd feb 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

2nd feb 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad
INDIA CORONA UPDATE

INDIA CORONA UPDATE

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య‌త‌గ్గుముఖం ప‌డుతోంది. నిన్న‌టి వ‌ర‌కూ 2ల‌క్ష‌ల‌కు పైగా కేసులు న‌మోదుకాగా ఆ సంఖ్య కాస్త త‌గ్గింది. తాజాగా గ‌డిచిన 24గంట‌ల్లో దేశంలో 1,61,386 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.

విశాఖ రైల్వే జోన్ పై కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సీపీఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జ‌రుగుతోంది. రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం దగ్గర నాయ‌కులు ధర్నాకు దిగుతున్నారు.

Advertisement

త్వ‌ర‌లో హైద‌రాబాద్ లో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల స‌ద‌స్సును నిర్వ‌హిస్తామ‌ని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలోని ప‌రిస్థితుల‌పై చ‌ర్చిస్తామ‌ని…. మేదోమ‌థ‌నం త‌రువాత పోరాట కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తామ‌ని అన్నారు. బీజేపీ పాల‌న‌పై తాను చ‌ర్చ‌కు రెడీ అని ఒక‌టి రెండు రోజుల్లో ముంబై వెళ్లి సీఎంను క‌లుస్తాన‌ని కేసీఆర్ అన్నారు.

పాఠశాల‌ల్లో భౌతిక‌దూరాన్ని పాటించ‌డాన‌కి ద‌క్షిణాఫ్రికా ప్ర‌భుత్వం స్వ‌స్తి చెప్పింది. దేశంలో 60 నుండి 80శాతం మంది ప్ర‌జ‌ల్లో క‌రోనాను ఎదురుకునే రోగ‌నిరోధ‌క‌శ‌క్తి పెరిగింద‌ని చెబుతూ ప్ర‌భుత్వం ఈ నిర్న‌యం తీసుకుంది.

విజ‌య‌వాడ బాలిక ఆత్మ‌హ‌త్య కేసులో నింధితుడు వినోద్ జైన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడికి కోర్టు 14రోజుల రిమాండ్ ను విధించింది.

Advertisement

బ‌డ్జెట్ లో కేంద్ర‌మంత్రి అమిత్ షా ప‌ర్య‌వేక్షిస్తున్న శాఖ‌కు రూ.900 కోట్ల‌ను కేటాయించారు. గ‌తేడాదే స‌హ‌కార‌శాఖ‌ను ఏర్పాటు చేశారు. స‌హ‌కార రంగాన్ని బ‌లోపేతం చేసేందుకే బ‌డ్జెట్ ను కేటాయించిన‌ట్టు పేర్కొన్నారు.

ఏపీ ఆర్టీసీ ఉద్యోగులు స‌మ్మెకు రెడీ అవుతున్నారు. 45 డిమాండ్ల‌తో కూడిన విన‌తీప‌త్రాన్ని ఉద్యోగ‌సంఘాలు ఆర్టీసీ ఎండీకి అంద‌జేశాయి. స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌క‌పోతే ఆరో తేదీనుండి స‌మ్మెకు దిగుతామ‌ని వార్నింగ్ ఇచ్చారు.

హైద‌రాబాద్ లో రాత్రి ఊష్ణోగ్ర‌త‌లు స్వ‌ల్పంగా పెరిగిన‌ట్టు వాతావ‌ర‌ణ‌శాఖ వెల్ల‌డించింది. హైద‌రాబాద్ లో స‌గ‌టు క‌నిష్ట ఊష్ణోగ్ర‌త‌లు 14.4డిగ్రీల సెల్సీయ‌స్ ఊష్ణోగ్ర‌త‌కు పెరిగినట్టు ప్ర‌క‌టించారు.

Danush Aishwarya

Danush Aishwarya

ర‌జినీకాంత్ కుమార్తె ధ‌నుష్ మాజీ భార్య ఐశ్వ‌ర్య క‌రోనా బారిన ప‌డ్డారు. క‌రోనా ల‌క్ష‌ణాలు తీవ్రంగా ఉండ‌టంతో ఐశ్వ‌ర్య ఆస్ప‌త్రిలో చేరారు.

టీడీపీలో విషాదం చోటు చేసుకుంది. దెందులూరి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత గార‌పాటి సాంబ‌శివ‌రావు 80 అనారోగ్యంతో మృతి చెందారు.

also read : రాధేశ్యామ్ రిలీజ్ డేట్ కూడా వ‌చ్చేసింది..ఎప్పుడంటే!

Visitors Are Also Reading