హాస్యనటుడు బ్రహ్మనందం పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఎక్కడో ఒక చిన్న లెక్చరర్‌గా జీవితం ప్రారంభించి.. ఇవాళ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులలో చోటు సంపాదించుకున్నాడు. దాని వెనుక ఎంత కష్టం ఉందో ఇట్టే అర్థమవుతుంది. తెలుగు హాస్య ప్రపంచంలో ఎంతో మంది తారలు ఉన్నా.. కన్నెగంటి బ్రహ్మనందం మాత్రం ఓ ధృవతార. 1250కి పైగా సినిమాల్లో నటించి.. ఆడియన్స్‌కు బోర్ కొట్టించకుండా నవ్వించాడు.
Advertisement
ఇప్పటికీ కూడా తనకు అంటూ ఓ ప్రత్యేకమైన హాస్యపు సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న ఘనత బ్రహ్మనందంకే దక్కుతుంది. ఈయన టాలీవుడ్‌కు ఓ బ్రాండ్ అనే చెప్పవచ్చు. అతనికి బట్టతల కనిపించినా చాలు హీరోకి పడ్డన్ని విజిల్స్ పడతాయి. రెండు దశాబ్దాఆల కాలం నుంచి బ్రహ్మీ ప్రస్థానం ఎదురు లేకుండా కొనసాగుతుంది. కేవలం ఆయన అప్పియరెన్స్‌తో కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి అంటే అతిశయోక్తి కాదు. మెగాస్టార్ చిరంజీవి పట్టుకొచ్చిన ఈ టాలెంట్ ఇప్పుడు తెలుగు పరిశ్రమ నవ్వుకే చిరంజీవిలా మారిపోయింది. తెలుగు చిత్ర పరిశ్రమ కళామతల్లి పెదవులపై ఎప్పుడూ చెరగని చిరునవ్వులా బ్రహ్మనందం ఉండిపోయాడు.
Advertisement
తొలుత చిన్న సినిమాలు చేసినా.. ఆ తరువాత వందలాది సినిమాల్లో తనదైన నటనతో మెప్పించారు బ్రహ్మీ. ముఖ్యంగా 1987లో జంధ్యాల తెరకెక్కించిన అహ నా పెళ్లంటలో ఈయన చేసిన అరగుండు పాత్ర అద్భుతమనే చెప్పవచ్చు. 35 ఏళ్ల కెరీర్‌లో అరడజన్‌కు పైగా నంది అవార్డులతో పాటు ఓ ఫిల్మ్ పేర్, మూడు సైమా అవార్డులను, కేంద్ర ప్రభుత్వం అందజేసే పద్మ శ్రీ అవార్డును సొంతం చేసుకున్నాడు లెజెండరీ కమెడియన్.
దర్శకులు చెప్పినా చెప్పకపోయినా సీన్ పండించడానికి తనవంతుగా సొంతంగా కొన్ని ఊత పదాలు సృష్టించాడు. అలా బ్రహ్మనందం నోట్లో నుంచి వచ్చిన జఫ్పా, నీయంకమ్మా, పండుగ చేస్కో, ఖాన్‌తో గేమ్స్ ఆడకు శాల్తీలు లేచిపోతాయ్, నా పర్పార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఇలా ఎన్నో మాటలు చిన్న పిల్లల నుంచి ముసలోళ్ల వరకు రోజు వాడుకుంటారు.
కేవలం బ్రహ్మికి మాత్రమే సాధ్యమయ్యే రికార్డు ఇది. ఒకప్పుడు బ్రహ్మనందం ఉంటేనే సినిమా. కానీ ఇప్పుడు కొత్త కమెడియన్లు రావడంతో తనకు తానుగా కాస్త పక్కకు తప్పుకున్నాడు బ్రహ్మి. ఇప్పుడు కొత్త అవకాశాలిస్తూ.. తనకు నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. ముఖ్యంగా బ్రహ్మనందం ఇప్పటివరకు ఆయన కెరీర్‌లో చేయని పాత్ర ఇది. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శ్రీరంగ మర్తాండ సినిమాలో సీరియస్ పాత్రలో నటిస్తున్నాడు. మరొక వైపు పంచతంత్రం చిత్రంలో కూడా వేద వ్యాస్ అంటూ మరొక సీరియస్ పాత్రలో నటిస్తున్నాడు. రెండు సినిమాలే కాకుండా మరొక ఐదారు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇవాళ హాస్యనటుడు బ్రహ్మనందం పుట్టిన రోజు. ఇలాంటి పుట్టిన రోజు వేడుకలను బ్రహ్మనందం మరెన్నో జరుపుకోవాలని మనం ఆకాంక్షిస్తుంది.