మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా టాలీవుడ్ దర్శకుడు కొరాటాల శివ తెరకెక్కిస్తోన్న భారీ చిత్రం ఆచార్య. ఈ సినిమా కొత్త విడుదల తేదీని మరొకసారి తాజాగా ప్రకటించారు. తొలుత ఫిబ్రవరి 04 , ఆ తరువాత ఏప్రిల్ 01 అని ఇలా పలు మార్లు పలు తేదీలను ప్రకటించినప్పటికీ తాజాగా మాత్రం మరోసారి నూతన తేదీని ప్రకటించింది చిత్ర బృందం. మార్చి 25న ఆర్ఆర్ఆర్ వస్తుండడంతో ఏప్రిల్ 29న ఆచార్య థియేటర్లలోకి వస్తుందని ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ముఖ్యంగా నిర్మాణ సంస్థలు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటైర్‌టైన్‌మెంట్ విడుదల తేదీని ఇవాళ ప్రకటించాయి.
Advertisement
అంతా బాగానే ఉందని సినిమాను విడుదల చేయాలనుకున్న తరుణంలోనే కోవిడ్ ప్రభావం విపరీతంగా పెరిగడంతో ఓవైపు ఆర్ఆర్ఆర్, మరొకవైపు రాధేశ్యామ్ లతో పాటు మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆచార్య సినిమాను ఫిబ్రవరి 04, ఏప్రిల్ 01న విడుదల చేస్తున్నామని ప్రకటించినప్పటికీ తాజాగా మాత్రం ఏప్రిల్ 29న విడుదల అవుతుందని పోస్టర్ విడుదల చేసింది.
Advertisement
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌లు కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై మెగా అభిమానులు భారీ అంచనాలు ఉన్నాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మధ్యలో మహమ్మారి కరోనా కారణంగా పెద్ద సినిమాలు అన్నీ వాయిదా పడ్డాయి. మార్చి 25న ఆర్ఆర్ఆర్ విడుదలవుతున్న తరుణంలో ఒక నెల గ్యాప్‌లో ఏప్రిల్ 29న ఆచార్య సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది చిత్ర బృందం. ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్‌చరణ్‌కు ఫ్యాన్ ఇండియా ఇమేజ్ వస్తుంది. దీంతో ఆచార్యను కూడా ఒకేసారి ఫ్యాన్ ఇండియా లేవల్‌లో విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తోంది.