యూఎస్ఏలో సీటెల్‌లోని ఒక సూపర్ మార్కెట్‌లో ఒక కస్టమర్ దాదాపు $600 విలువ అయిన 70 అంగుళాల టీవీతో బయటకు వచ్చాడు. తలుపు వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డులకు అనుమానం వచ్చి ఆ వ్యక్తిని టీవీ కొనుగోలు చేసినందుకు గాను రశీదు అడిగారు. అయితే అతను టీవీని ఎత్తేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ వ్యక్తిని చుట్టుముట్టిన గార్డులు ఎట్టకేలకు పట్టుకుని పోలీసులు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ పుటేజీలు నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నది.
Advertisement
Advertisement
టీవీని దొంగిలించిన వ్యక్తి పేరు జాన్ రే లోమాక్ (55) అని, అతడు నిరాశ్రయుడు అని తెలుస్తోంది. వరుస దుకాణాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నాడని పోలీసుల విచారణలో తేలింది. అదేవిధంగా లోమాక్ గత మూడు నెలల్లో ఇదే సూపర్ మార్కెట్‌లో 22 సార్లు దొంగిలించాడని.. గత డిసెంబర్‌లో ఇలాంటి టీవీని దొంగిలించడానికి ప్రయత్నించినందుకు దుకాణంలోకి ప్రవేశించకుండా నిషేదించారని సూపర్ మార్కెట్ సిబ్బంది వివరించారు. అనంతరం లోమాక్‌ను కోర్టులో హాజరు పరిచారు. కానీ లోమాక్ నిరాశ్రయుడు కాబట్టి న్యాయమూర్తి నిర్దోశిగా ప్రకటించారు.