టాలీవుడ్ అగ్రదర్శకుల్లో ఒకరైన పూరిజగన్నాథ్ దర్శకుడిగా తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే అందులో హీరో రామ్ పోతినేని నటించగా.. హీరోయిన్గా నిధి అగర్వాల్ నటించారు. అయితే నిధి అగర్వాల్, స్టార్ హీరో శింబు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అన కొద్ది రోజులుగా గాసిప్స్ హల్ చల్ సృష్టిస్తున్నాయి. సినీ పరిశ్రమలో తాజా నివేదికల ప్రకారం.. శింబు త్వరలో సంబంధాన్ని ఎట్టకేలకు అధికారికం చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం అని తెలుస్తోంది. ఈ పుకార్లపై శింబు కానీ, నిధి కానీ స్పందించకపోవడంతో వీరి ప్రేమాయణం, పెళ్లిపై మాత్రం అంతగా క్లారిటీ లేదు. కానీ విరిద్దరూ 2022లోనే వివాహం చేసుకునే అవకాశం ఉందని సమాచారం.
Advertisement
Advertisement
త్వరలో శింబు తన వివాహ వివరాలను అభిమానులు, శ్రేయోభిలాషుల కోసం ప్రకటించనున్నారని పలువురు పేర్కొంటున్నారు. శింబు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లో ఒకరూ. ఆయన పెళ్లి పుకార్లు ఎప్పుడూ ఇంటర్నెట్లో సందడి చేస్తూనే ఉన్నాయి. ఇద్దరు నటినటులు అభిమానులు ఈ వార్తలతో చాలా ఉల్లాసంగా ఉన్నారు. ఇప్పుడు ఈ పెద్ద ప్రకటన కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ సన్నిధికి సన్నిహితంగా ఉన్న కొంత మంది ఈ వార్తలను కొట్టిపారేశారు. శింబు, నిధి ఈశ్వరన్‌లో స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్నారు. దీనికి ఒక మోస్తారు స్పందన లభించింది. అయితే అభిమానులు వారి ఆన్ స్క్రీన్ కెమెస్ట్రీకి మంచి మార్కులు వేశారు.