చాలా వరకు ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. కానీ ఆస్ట్రేలియా టెన్నీస్ క్రీడాకారిని మాత్రం ఆష్లే బార్టీ తొలుత రచ్చ గెలిచింది. ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌లలో విజయపతాకాన్ని ఎగురవేసింది. కానీ సొంతగడ్డపై జరిగే ఆస్ట్రేలియా ఓపెన్ మాత్రం దక్కించుకోవడానికి చాలా రోజుల సమయం పట్టింది. 2022 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ లో అమెరికా అమ్మాయి డానియెలీ రోజ్ కొల్సిన్‌ను ఓడించి సొంతగడ్డపై గ్రాండ్ స్లామ్ బోణీ కొట్టింది.
Advertisement
ప్రస్తుతం మహిళల టెన్నిస్‌లో పరిపూర్ణ క్రీడాకారిణీ తానే అని బార్టీ చాటి చెప్పింది. నిలకడ లేమికి మారుపేరుగా మహిళల టెన్నిస్‌లో మిగతా ప్లేయర్ల కంటే ఎంతో మెరుగుగా ఆడుతున్న బార్టీ మూడు రకాల కోర్టులలో గ్రాండ్ స్లామ్ గెలిచిన క్రీడాకారిణీగా ఘనత సాధించింది. మహిళల సింగిల్స్ ఫైనల్‌లో బార్టీ 6-3, 7-6 (7-2) కొలిన్స్‌పై విజయం సాధించింది. ఈ టోర్నీలో తనకంటే మెరుగైన క్రీడాకారిణులను కష్టపడి ఓడించి ఫైనల్ చేరిన కొలిన్స్.. బార్టీకి అంత తేలిగ్గా ఏమి లొంగలేదు. సరిగ్గా గంటన్నరలో ముగిసిన మ్యాచ్‌లో కొలిన్స్ బాగానే పోటీ ఇచ్చింది.
Advertisement
తొలిసెట్‌లో తొలి రెండు సర్వీస్‌లను నిలబెట్టుకున్న కొలిన్స్.. ఆరవ గేమ్‌లో బ్రేక్ పాయింట్ ను కాపాడుకున్న బార్టీ.. వెంటనే ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి ఆధిక్యం సంపాదించింది. ఆ తరువాత తన సర్వీస్‌లను నిలబెట్టుకుని సెట్‌ను చేజిక్కించుకుంది. రెండవ సెట్‌లో మాత్రం కొలిన్స్ నుంచి ఎదురుదాడి మొదలైంది. తొలి గేమ్‌లోనే బార్టీ సర్వీస్‌ను బ్రేక్ చేసిన కొలిన్స్ పాయింట్ సాధించి 5-1 సెట్ విజయానికి చేరువగా వచ్చింది. ఇక మ్యాచ్ మూడవ సెట్‌కు వెళ్లడం లాంఛనమే అనుకున్న దశలో బార్టీ గొప్పగా పుంజుకుంది. తరువాత గేమ్‌లో బ్రేక్ పాయింట్ సాధించి ఊపిరి పీల్చుకుంది. చివరికి స్కోరు 6-6 సమానం అయింది. ట్రై బ్రేకులో బార్టీ దూకుడు ముందు కొలిన్స్ నిలవ లేకపోయింది. నాలుగుసార్లు ఆమె సర్వీస్‌ను బ్రేక్ చేసిన బార్టీ 7-2తో పై చేయి సాధించి టైటిల్‌ను దక్కించుకుంది. మ్యాచ్‌లో బార్టీ 10 ఏస్‌లు కొట్టగా.. కొలిన్స్ ఒక్కటే కొట్టింది. విన్నర్లలో కూడా బార్టీ (30-17) దే ఆధిపత్యం. ఇరువురు కూడా 22 అనవసర తప్పులు చేసారు.