Home » మిస్టర్‌ బచ్చన్‌ చెత్త నిర్ణయం… డిజాస్టర్‌ ని ఒప్పుకున్న నిర్మాత..!

మిస్టర్‌ బచ్చన్‌ చెత్త నిర్ణయం… డిజాస్టర్‌ ని ఒప్పుకున్న నిర్మాత..!

by Sravanthi
Ad

చాలా తక్కువ సినిమాలు మాత్రమే హిట్ అవుతూ ఉంటాయి. ఎన్నో సినిమాలు ప్రతీ ఏటా డిజాస్టర్ అవుతుంటాయి. కొన్ని మూవీస్ కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్స్ అవుతాయి. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమా
డిజాస్టర్ అనడంలో ఏమాత్రం సందేహపడక్కర్లేదు. ఈ సంవత్సరం విడుదలైన సినిమాల్లో పెద్ద డిజాస్టర్ గా మిస్టర్ బచ్చన్ నిలిచింది. మిస్టర్ బచ్చన్ ప్రొడ్యూసర్ టిజి ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. షూటింగ్ ప్రారంభం అయిన కొన్ని రోజులు ముందు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. 1984 హిందీ సూపర్ హిట్ సాంగ్స్ నచ్చడంతో సినిమా ఆడేస్తుందని అనుకున్నారు.

Advertisement

ఇక్కడ తప్పు జరిగింది చాలా ఎపిసోడ్స్ స్పీడ్ గా షూట్ చేయడం కొన్ని సన్నివేశాలు అయినా కరెక్ట్ గా తీసి ఉంటే తప్పకుండా హిట్ అయి ఉండేదేమో అని అన్నారు. అలాగే కొన్ని యాక్షన్ సన్నివేశాల విషయంలో కూడా బాగా ఫోకస్ చేసి ఉంటే బాగుంటుందని ఆయన అన్నారు. ఈ మూవీ ని నిర్మించడం తన జీవితంలో అతిపెద్ద చెత్త నిర్ణయం అని భావిస్తున్నాను అని చెప్పారు.

Advertisement

Also read:

రీమేక్ కంటే ఒరిజినల్ స్టోరీ తో సినిమా చేస్తే బాగుంటుందని అనుకున్నాను. రీమేక్ ఎందుకని అడిగానని అప్పటికే రీమేక్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేయడంతో మార్చలేకపోయామని ఆయన అన్నారు. 2024 లో పెద్ద డిజాస్టర్ మిస్టర్ బచ్చన్ అని నిర్మాత ఒప్పుకున్నారు. మిస్టర్ బచ్చన్ వలన 10 నెలల నుంచి కొత్త మూవీని ప్రారంభించలేదని చెప్పారు.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading