తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీహరి. హీరోగా విలన్ గా నటించి శ్రీహరి తనకంటూ టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఏ పాత్ర చేసినా ఆ పాత్రకు న్యాయం చేస్తూ సినిమాకే హైలెట్ గా నిలిచేవారు. శ్రీహరి నటించిన కుబుసం, శ్రీమన్నారణ, భద్రాచలం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మగధీర లాంటి సినిమాలు మంచి విజయం సాధించాయి. కానీ కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో శ్రీహరి మరణించడం టాలీవుడ్ పరిశ్రమకే తీరని లోటుగా మారిపోయింది.
శ్రీహరి కుటుంబంలో ఎవరూ నటినటులు లేకున్నా నటనపై ఉన్న ఆసక్తితో శ్రీహరి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. బాడీ బిల్డింగ్ పై తనకు ఉన్న ఆసక్తితో శ్రీహరి మిస్టర్ హైదరాబాద్ గా కూడా గెలిచారు. మార్షల్ ఆర్ట్స్ లోనూ శ్రీహరికి ఎంతో పట్టు ఉంది. తన కల తన శరీర దారుడ్యం వల్లే శ్రీహరికి ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయి. అలా అంచలంచెలుగా ఎదిగిన శ్రీహరి ప్రముఖ నటుడిగా ఎదిగారు.
Advertisement
Advertisement
అంతే కాకుండా సీనీపరిశ్రమలోని డిస్కో శాంతిని ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ 2013లో తీవ్ర అనారోగ్యం కారణంగా శ్రీహరి మరణించారు. అయితే శ్రీహరి ఎక్కువగా మద్యం సేవించేవారని అందువల్లే అనారోగ్యం బారిన పడి మృతి చెందారని అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే తాజాగా శ్రీహరికి సన్నిహితులు టాలీవుడ్ సీనియర్ నటుడు మేక రామకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మేక రామకృష్ణ బాహుబలి సినిమాతో పాటూ మరికొన్ని చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఓ ఇంటర్వ్యూలో మేక రామకృష్ణ మాట్లాడుతూ శ్రీహరి ఎంతో మంచి వాడని చాలా ఆప్యాయతగా పలకరించేవారిని అన్నారు. అంతే కాకుండా ఆయన మరణానికి ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం కారణం కాదని శ్రీహరి ఎక్కువగా పాన్ పరాక్ లు తినేవారని తెలిపారు.
Also Read: త్వరలో బిగ్ బాస్ ఓటీటీ…ఎంట్రీ ఇస్తున్న మాజీ కంటెస్టెంట్లు వీరే…!