మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి పెద్ద హీరోగా మారారు. 150 కి పైగా సినిమాలులో నటించారు రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి కొన్నాళ్ళు తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి మళ్లీ సినిమాలతో బిజీ అయిపోయారు. చిరంజీవి పవన్ కళ్యాణ్ మాత్రం ప్రస్తుతం ఫుల్ ఫోకస్ అంతటినీ కూడా పాలిటిక్స్ మీద పెట్టారు. పిఠాపురం నుండి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ కి మెగా కుటుంబం నుండి మద్దతు భారీగా ఉంది.
Advertisement
చిరంజీవి పవన్ కళ్యాణ్ కి ఓటు వేయాలని ప్రత్యేక వీడియోని విడుదల చేశారు నాగబాబుతో కూడా వరుణ్ తేజ్, సాయి ధరంతేజ్, వైష్ణవ తేజ్ పిఠాపురంలో ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. రామ్ చరణ్, చిరంజీవి భార్య సురేఖ, అల్లు అరవింద్ పిఠాపురానికి వెళ్లారు పవన్ కి మద్దతు తెలిపారు. అయితే అల్లు అర్జున్ మాత్రం భిన్న నిర్ణయాన్ని తీసుకున్నారు నంద్యాలలో వైసిపి అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. ఏకంగా నంద్యాల వెళ్లి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కి సపోర్ట్ ఇచ్చారు. అప్పటినుండి మెగా ఫ్యామిలీలో చీలి కానీ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వాస్తవానికి ముందు రోజే సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి మద్దతు ప్రకటించారు.
Advertisement
Also read:
Also read:
రాజకీయంగా తాను అనుకున్నది సాధించాలని ఆకాంక్షించారు తర్వాత నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. అప్పటినుండి మెగా కుటుంబం టార్గెట్ అయింది 2019 ఎన్నికల సమయంలో కూడా బన్నీ కిషోర్ రెడ్డికి సపోర్ట్ చేశారు. ఆ ఎన్నికల్లో 30 వేల మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు బన్నీని తీసుకొస్తే అడ్వాంటేజ్ అవుతుందనే ప్రచారానికి పిలిచారు. అల్లు అర్జున్ వైసీపీకి మద్దతు తెలిపారు అన్నది అవాస్తవం అని మెగా అభిమానులు అంటున్నారు. వైసీపీకి అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ కి ఎందుకు ముందు రోజే మద్దతు తెలిపారని, కేవలం స్నేహితుడు అయినందుకే బన్నీ కలిశారని అతని మద్దతు జనసేనకి ఉందని చంద్రబాబు కూడా చెప్పారు. మెగా కుటుంబంలో చిచ్చు పెట్టాలని వైసీపీ కూడా చూస్తోందని అంతా అంటున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!