టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాలనుకున్న కేరళ స్పిన్నర్ ఆశా శోభన కల నెరవేరింది. మహిళలతో జరుగుతున్న నాల్గవ T20 లో ఈమె అవకాశాన్ని పొందారు. సిల్హేట్ వేదికగా బంగ్లాదేశ్ మహిళల తో ఈ మ్యాచ్ జరగబోతోంది. భారత స్టార్ బ్యాటర్ స్మృతి మందన చేతుల మీదుగా శోభనా టీమిండియా క్యాప్ ను అందుకుంది. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే 33 ఏళ్ల వయసులో ఆమె అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టింది.
Advertisement
Also read:
దీంతో భారత మహిళా జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అతి పెద్ద వయసు లో క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన మహిళగా ఆశ రికార్డులోకి ఎక్కింది. 31 ఏళ్ల వయసులో భారత్ తరపున క్రికెట్ లోకి అడుగుపెట్టిన సీమ పుజారే రికార్డులని బద్దలు కొట్టింది. సీమ 2008లో రంగి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం లో శ్రీలంకతో జరిగిన వన్డే లో అంతర్జాతీయ క్రికెట్ లోకి దిగారు. కేరళ రాజధాని త్రివేండ్రం లో 1991లో జన్మించిన ఆశ పేదరికంతో పోరాడుతూ క్రికెట్ పై దృష్టిపెట్టారు.
Advertisement
Also read:
13 ఏళ్ల వయసులో కెరియర్ ని ప్రారంభించిన ఆశా శోభన తర్వాత సీనియర్ జట్టుకి ఆడింది. దేశీ క్రికెట్లో కేరళ పుదుచ్చేరి రైల్వే జట్లకు ప్రాతినిధ్య వహించారు. కేరళ తరపున రాణించడంతో ఈమెకి భారతీయ జట్టులో అవకాశం వచ్చింది. గత కొన్నేళ్లుగా మంచి ప్రదర్శన చేస్తున్న జాతీయ జట్టులో చోటు రాలేదు భారత్ మాజీ స్పిన్నర్ నీతూ డేవిడ్ ను ఆదర్శంగా తీసుకొని క్రికెట్ గా ఎంచుకున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!