వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరలక్ష్మి శరత్ కుమార్ గత కొన్ని రోజులుగా వార్తల్లోకి ఎక్కుతూనే ఉన్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె గురించి మాట్లాడుకుంటున్నారు. ఆమె గ్యాలరీస్ట్ అయిన నికోలై సచ్ దేవ్ ని పెళ్లి చేసుకోనుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. వీళ్ళ పెళ్ళి త్వరలోనే జరగబోతుంది అని కూడా వార్తలు వస్తున్నాయి. సచ్ దేవ్ ఒక గ్యాలరీస్. 17 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుని విడాకులు కూడా తీసుకున్నాడు. వయసులో వరలక్ష్మి కంటే కూడా చాలా పెద్దవాడు. 15 ఏళ్ల కూతురు కూడా ఇతనికి ఉంది.
Advertisement
అతని భార్య పేరు కవిత. ఆమె మోడలింగ్ చేస్తూ అందాల పోటీల్లో పాల్గొంది. 2007 నుండి 14 వరకు రకరకాల పోటీల్లో ఆమె పాల్గొన్నారు. కొన్ని పోటీల్లో ఫైనల్ వరకు కూడా వెళ్లారు. కవితలని నికోలై సచ్ దేవ్ మధ్య కొన్నాళ్ళకి విభేదాలు రావడం వలన విడాకులు తీసుకున్నారు. ఈ జంటకి పుట్టిన అమ్మాయి ఇటీవల అథ్లెటిక్స్ లో ఛాంపియన్ గా మెరిసింది. అయితే వరలక్ష్మి అతన్ని పెళ్లి చేసుకోవడం సంచలనంగా మారింది.
Advertisement
Also read:
Also read:
గత పది, 12 ఏళ్ల నుండి వీళ్ళ మధ్య స్నేహం ఉంది. అతని వ్యక్తిత్వం చాలా దగ్గర నుండి చూసింది వరలక్ష్మి. ఇష్టపడి పెళ్లి చేసుకుంది. మొదట కుటుంబ సభ్యుల నుండి పెళ్ళికి అంగీకారం రాలేదు. కానీ తర్వాత అంత ఒప్పుకుని నిశ్చితార్థం చేశారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. వరలక్ష్మీ తలుచుకుంటే ఎంత మంచి అబ్బాయి అయినా సరే ఓకే చెప్పేస్తాడు. కానీ పెళ్లయి విడాకులు తీసుకుని కూతురు ఉన్న అతన్ని పెళ్లి చేసుకోవడం ఏంటని సోషల్ మీడియాలో యూజర్లందరూ కూడా కామెంట్లు చేస్తున్నారు ఏది ఏమైనా వరలక్ష్మీ పెద్ద డేరింగ్ స్టెప్ వేసింది.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!