Home » శభాష్.. టెన్త్ పరీక్షలలో 594 మార్కులు సాధించిన రైతుబిడ్డ హర్షిత..!

శభాష్.. టెన్త్ పరీక్షలలో 594 మార్కులు సాధించిన రైతుబిడ్డ హర్షిత..!

by Sravya
Ad

హర్షిత అనే అమ్మాయికి 594 మార్కులు వచ్చాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా రుద్రవరం మండలం వీరవోలు ప్రాంతానికి చెందిన హర్షిత కి టెన్త్ క్లాస్ పరీక్షల్లో 594 మార్కులు వచ్చాయి. హర్షిత తండ్రి ఒక రైతు. ఒక రైతు బిడ్డ అయిన హర్షితకి టెన్త్ క్లాస్ లో ఇన్ని మార్కులు రావడంతో గ్రామస్తులు సంతోష పడుతున్నారు. వాళ్ల సంతోషానికి అసలు అవధులే లేకుండా పోయాయి. హర్షిత మండలంలోని ఎక్కువ మార్కులు సాధించి ప్రశంసలు పొందారు. నంద్యాలలో ప్రముఖ పాఠశాలలో చదివిన హర్షిత స్కూల్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు.

Advertisement

తమ కూతురికి మంచి ర్యాంకు రావడంతో తల్లిదండ్రులు సంతోష పడుతున్నారు. హర్షిత తల్లిదండ్రులు పుల్లారెడ్డి, శిరీష చాలా సంతోషంగా ఉందని అన్నారు. హర్షిత ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె ఫోటోలు ని షేర్ చేసి ఆమెకి అంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హర్షితకి మంచి మార్కులు వచ్చిన నేపథ్యంలో ఆమె ఉన్నత చదువులకి ప్రభుత్వం నుండి కొంత సహాయం అందితే కెరియర్ పరంగా హర్షిత మరింత ఎదిగే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

Advertisement

Also read:

Also read:

రైతు బిడ్డ హర్షితని చదువు విషయంలో ప్రోత్సహించిన కుటుంబ సభ్యుల్ని మెచ్చుకుంటున్నారు. అంతా ఎంతో కష్టపడి మార్కులు సాధించారు 10వ తరగతి పరీక్షల్లో 550 కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం ఏదైనా స్కీమ్ ని తీసుకొస్తే బాగుంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నిజంగా ఒక రైతు బిడ్డ ఇన్ని మార్కులు సాధించడం గొప్ప విషయం. భవిష్యత్తులో కూడా ఆమె అనుకున్నది సాధించాలని కోరుకుందాం.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading