భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటేనే ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా జరుగుతుంది. ఎప్పటి నుంచో నువ్వా నేనా అన్నట్టు రెండు టీమ్ ఢీ కొంటుటాయి. కొన్ని సార్లు భారత్ గెలిస్తే.. మరికొన్ని సార్లు పాక్ గెలుస్తుంటుంది. చివరికీ ఎక్కువ సార్లు మాత్రం భారత్ పై చేయిగా నిలిచింది. కానీ ఈ మధ్య కాలంలో టీ-20 ప్రపంచకప్‌లో మాత్రం భారత్ పాక్‌పై ఓటమి పాలైంది. ముఖ్యంగా భారత్ పై ప్రదర్శన చేయడం పాక్ క్రికెటర్లకు పెద్ద కల అనే చెప్పొచ్చు. ఇప్పుడు మరొక పాకిస్తాన్ బౌలర్ అలాంటి కోరికనే వ్యక్తం చేశాడు. అతడే పాక్ పేసర్ షాహీన్ షా ఆప్రిది.
Advertisement
Advertisement
భారత మాజీ కెప్టెన్, టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కే.ఎల్. రాహుల్‌ల వికెట్లు తీసి హ్యాట్రిక్ సాధించాలనేది తన కలన అని 21 ఏండ్ల లెప్టార్మ్ ఫాస్ట్ బౌలర్ షాహిన్ పేర్కొన్నాడు. ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్‌ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు షాహీన్.
షాహీన్ ముఖ్యంగా గత ఏడాది జరిగిన టీ-20 ప్రపంచ కప్ లో భారత్-పాకిస్తాన్ మధ్య తొలి మ్యాచ్‌లో తొలి రెండు ఓవర్లలో రోహిత్, రాహుల్ వికెట్లను తీశాడు. అదేవిదంగా తన చివరి ఓవర్‌లో విరాట్ కోహ్లీని ఔట్ చేశాడు. అదేవిధంగా షాహీన్ ఆప్రిది తనకు ఇష్టమైన వికెట్ ఏది అని కూడా వివరించాడు. ఇటీవల ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ టైటిల్‌ను గెలుచుకున్న షాహీన్.. టీ-20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ వికెట్ తన కెరీర్‌లో అత్యంత ఇష్టమైన వికెట్ అని చెప్పుకొచ్చాడు.